ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు క్రికెట్ ఫ్యాన్స్ ఒక షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ నుంచి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నాడు. కాకపోతే మొత్తం సీజన్‌కు కాకుండా.. ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే వార్నర్ ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. వార్నర్‌తో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా కూడా లీగ్‌లోని కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో అక్కడ ఇరు జట్లు మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ ఏప్రిల్ 5 వరకు జరగనున్నాయి.
దీంతో ఆస్ట్రేలియా జట్టులో ఉన్న సభ్యులు ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అవ్వనున్నారు. ఐపీఎల్ 15వ ఎడిషన్ మార్చి 27 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ సెక్రటరీ జైషా కూడా ఐపీఎల్ 2022 మార్చి చివర్లో ప్రారంభం అవుతుందని ఇది వరకే ఒకసారి స్పష్టం చేశారు. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేకుండా మార్చి చివర్లోనే ఐపీఎల్ ప్రారంభమైతే ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందుబాటులో ఉండడం కష్టమే. ఏప్రిల్ 5 నాటికి వారు పాకిస్థాన్ పర్యటన ముగించుకుని భారత్ వచ్చి కరోనా నిబంధనలు పూర్తి చేసుకునే సరికి ఆరంభ మ్యాచ్‌లు అయిపోతాయి. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్, గ్లెయిన్ మాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్, పాట్ కమిన్స్, స్టీవెన్ స్మిత్ వంటి ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ శనివారం, ఆదివారం జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫ్రాంచైజీలన్నీ కూడా మెగావేలానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఐపీఎల్‌కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరమవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తనకు జరిగిన అవమానంపై తొలిసారి నోరువిప్పిన డేవిడ్ వార్నర్