‘డానియల్ జార్విస్’ ఇతను క్రికెట్ అభిమానులకు ‘జార్వో 69’గా సుపరిచితుడు. ఇంగ్లాండ్ బోర్న్ ఇండియన్ ఫ్యాన్‌గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్. భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది మొదలు జార్వో 69 చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టీమిండియా జెర్సీ వేసుకుని మైదానం నానా హంగామా చేశాడు. తాజాగా నాలుగో టెస్టు రెండో రోజు ఉమేష్ యాదవ్ 34వ ఓవర్ వేస్తుండగా ఒక్కసారిగా జార్వో పరుగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ వేసేందుకు ప్రయత్నించి నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న బెయిర్‌స్టోని ఢీకొట్టాడు. శ్రుతి మించితే ఏం చేస్తారు చెప్పండి. చివరికి జార్వో పరిస్థితి అదే అయ్యింది.
ఓవల్ స్టేడియం భద్రతా సిబ్బంది అతనిని పోలీసులకు అప్పగించారు. వారు జార్వోని అరెస్టు చేసి సౌత్ లండన్ పోలీస్‌స్టేషన్‌కు కస్టడీకి తరలించారు. ఒకసారి మైదానంలోకి అడుగుపెట్టి ఫీల్డింగ్ చేస్తూ అడ్డుకున్న భద్రతా సిబ్బందిని నేను టీమిండియా ప్లేయర్‌నంటూ జెర్సీ చూపించి బెదిరించిన దగ్గర నుంచి జార్వో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. అప్పుడు ఆ ఘటనను అందరూ సరదాగానే చూశారు. ఆ తర్వాత కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ దిగి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఇక, నాలుగో టెస్టులో బౌలింగ్ కూడా చేశాడు. మొదటి రెండుసార్లు సరాదాగా తీసుకున్న ప్రేక్షకులు, నెటిజన్లు ఈసారి మాత్రం డానియల్ జార్విస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నిసార్లు ఇలా జరగడంపై అక్కడి భద్రతా ఏర్పాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు.
Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f
— Raghav Padia (@raghav_padia) September 3, 2021