ఈ సీజన్ ఐపీఎల్ చూసిన వారికి యష్ దయాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ గుజరాత్ టైటాన్స్ పేసర్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. దేశంలో జరుగుతున్న లవ్ జిహాద్ సంఘటనలపై వైరల్ అవుతున్న ఓ మీమ్‌ని ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు యశ్ దయాల్.
ఈ సీజన్ ఐపీఎల్ చూసిన వారికి యష్ దయాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి 5 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు సమర్పించుకున్నాడు. రింకు సింగ్ దాటికి ఏకంగా జట్టులో చోటే కోల్పోయాడు ఈ గుజరాత్ బౌలర్. ఈ మ్యాచ్ ద్వారా రింకు సింగ్ ఎంత ఫేమస్ అయ్యాడో.. యష్ దయాళ్ కి అంతే పబ్లిసిటీ వచ్చింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత అస్వస్థకు గురైన దయాల్.. జ్వరంతో చాలా మ్యాచులకి దూరంగా ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చి పర్వాలేదనిపించాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ పేస్ బౌలర్ ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ పేసర్ యష్ దయాల్ ఇప్పుడు ఒక కొత్త వివాదం వెంటాడుతుంది. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వివాదాస్పద కథనం పోస్ట్ చేసాడు. ఈ పోస్టు మతపరమైన మనోభావాలకు వ్యతిరేకంగా ఉండడంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసాడు. కానీ పోస్టుకి సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను కావాలని పోస్ట్ చేయలేదని క్షమాపణలు తెలియజేశాడు. దయాల్ మాట్లాడుతూ ” పొరపాటున ఆ కథనాన్ని పోస్ట్ చేసాను. దయాచేసి క్షమించండి. ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దు. సొసైటీలో ప్రతి సంఘం కమ్యూనిటీ పట్ల నాకు గౌరవం ఉంది”. అని తెలియజేశాడు.
‘లవ్ జిహాద్ అనేది లేదు, అదంతా మాపై చేస్తున్న తప్పుడు ప్రచారం. నిజంగా నేను నిన్న ప్రేమిస్తున్నా’ అంటూ ఓ ముస్లిం యువకుడు, కళ్లకు గంతలు కట్టి ఉన్న హిందూ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. దానికి ఆమె.. ‘నాకు తెలుసు అబ్దుల్, నువ్వు అలాంటి వాడివి కాదు. నేను నిన్ను గుడ్డిగా నమ్ముతున్నా’ అని సమాధానం చెబుతుంది. ఆ ముస్లిం యువకుడు చేతిలో కత్తి ఉండడంతో పాటు చుట్టూ లవ్ జిహాద్‌లో అంతమైన ప్రియ, వర్ష, శివానీ, దీక్ష, రియా, నికిత, నితూ, తనికా, సాక్షి అనే అమ్మాయిల సమాధులు ఉన్నాయి. యశ్ దయాల్ వంటి క్రికెటర్, ఇలాంటి పోస్ట్ చేయడంతో ఒక్కసారి సోషల్ మీడియా షేక్ అవుతోంది. దీనిపై కొందరు నెటిజన్స్ క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ధైర్యంగా సమాజంలో జరుగుతున్న విషయాన్ని పోస్ట్ చేసినందుకు అతను నిజమైన హీరో అయ్యాడంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. దీంతో ఐపీఎల్ ముగిశాక మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాడు యశ్ దయాల్. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.