టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా లండన్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్ షిప్‌లో అదరగొడుతున్నాడు. మూడు వరుస మ్యాచ్‌ల్లోనూ సెంచరీలతో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచిన పుజారా.. తర్వాతి రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలతో కదం తొక్కాడు. పూర్ ఫామ్‌తో టీమిండియా స్థానంలో కోల్పోయిన పుజారా.. కౌంటీ క్రికెట్‌లో ఈ ఏడాది తొలిసారి అడుగుపెట్టాడు. ససెక్స్ జట్టు తరుపున ఆడుతున్న పుజారా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 201(నాటౌట్), 109, 128(నాటౌట్).. ఇవి వరుస మ్యాచ్‌లలో పుజారా చేసిన పరుగులు.
కౌంటీ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో సాగుతున్న పుజారా తిరిగి టీమిండియా టెస్టు జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ తర్వాత సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో పుజారాకు చోటు దక్కుతుందని అతని ఫ్యాన్స్ కూడా ధీమాగా ఉన్నారు. కాగా ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ హవా నడుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో పుజారాను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. మరి కౌంటీ క్రికెట్‌లో పుజారా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పుజారాకి అవమానం! మరీ ఇంత దారుణమా?
Cheteshwar Pujara has scored his third century in three matches for Sussex 💪https://t.co/5HitelKi3e #CountyCricket2022 pic.twitter.com/pjy8rod3t7
— ESPNcricinfo (@ESPNcricinfo) April 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.