ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్ లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. సునామీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఓ విండిస్ బ్యాటర్ బౌలర్లకు తన విశ్వరూపాన్ని చూపాడు. భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. 211 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 10 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో రికార్డు స్థాయిలో 27 సిక్సర్లు నమోదు అయ్యాయి. ఇరు బ్యాటర్లు తమ బ్యాట్ లకు పని చెప్పడంతో.. బౌలర్లు చేతులెత్తేశారు. భారీ స్కోర్లు నమోదు అయ్యిన ఈ మ్యాచ్ లో కొమిల్లా విక్టోరియన్స్ 7 వికెట్ల తేడాతో ఖుల్నా టైగర్స్ ను ఓడించింది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా.. మంగళవారం (జనవరి 31) ఖుల్నా టైగర్స్ వర్సెస్ కొమిల్లా విక్టోరియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాట్స్ మెన్ చెలరేగడంతో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. మరీ ముఖ్యంగా కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు అయిన చార్లెస్ జాన్సన్ ప్రత్యర్థి బౌలర్లపై ఓ మినీ యుద్ధాన్నే ప్రకటించాడు. క్రీజ్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. చార్లెస్ విధ్వంసంతో 211 పరుగుల భారీ స్కోరు సైతం అతడి ముందు చిన్నబోయింది. 56 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో కొమిల్లా జట్టు ఇంకో 10 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. చార్లెస్ బాదుడుకు ప్రత్యర్థి బౌలర్లకు బాల్స్ ఎక్కడ వేయాలో కూడా అర్థం కాలేదు. అంతలా అతడి విధ్వంసం సాగింది.
ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. టైగర్స్ బ్యాటర్లు అయిన తమీమ్ ఇక్బాల్, షై హోప్ లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టైగర్స్ జట్టులో తమీమ్ ఇక్బాల్ 61 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక్బాల్ తో పాటుగా కెప్టెన్ షై హోప్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 91 పరుగులతో సెంచరీ ముందు అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ఆజమ్ ఖాన్ 4 బంతుల్లో ఫోర్, సిక్సర్ తో 12 పరుగులు చేశాడు.
Johnson Charles with 11 huge sixes in his 107* in the BPL today 💪 #BPL2023 pic.twitter.com/Pih4cfYHdq
— ESPNcricinfo (@ESPNcricinfo) January 31, 2023
అనంతరం 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగారు. స్టార్ ఓపెనర్ లిటన్ దాస్(4) పరుగులకే రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగ్గా.. కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్(5) తర్వాగా అవుట్ అయ్యాడు. అనంతరం మెుదలైంది అసలైన మజా. జాన్సన్ చార్లెస్ జాన్సన్, పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ లు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపెడుతూ.. సిక్సర్ల వర్షం కురిపించారు. చార్లెస్ 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్లతో 107 పరుగులు చేయగా.. అతడికి అండగా మహ్మద్ రిజ్వాన్ కూడా చెలరేగాడు. రిజ్వాన్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేయడంతో.. మరో 10 బంతులు ఉండగానే కొమిల్లా విక్టోరియన్స్ విజయం సాధించింది. ఈ విజయంతో విక్టోరియన్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. మరి ఇంతలా విధ్వంసం సృష్టించిన విండిస్ ప్లేయర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A 39-ball 79, Mohammad Rizwan continues rich vein of form 🔥#BPL2023 pic.twitter.com/tp6TaRUjPT
— CricWick (@CricWick) January 31, 2023