భారత్‌లో యంగ్ టాలెంట్‌కు కోదవలేదని మరోసారి నిరూపించాడు బిహార్ రాష్ట్ర రంజీ ప్లేయర్ షకీబుల్ గని. రంజీలో అరంగేట్రం మ్యాచ్‌తోనే ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ 2022 సీజన్‌లో బిహార్ తరుపున ఆడుతున్న షకీబుల్ ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టాడు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ క్యాంపస్ 2వ గ్రౌండ్‌లో గ్రూప్ మ్యాచ్‌ల్లో బిహార్, మిజోరాం మధ్య జరిగిన మ్యాచ్‌తో 22 ఏళ్ల షకీబుల్ గని ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేశాడు. ఈ క్రమంలో 71 పరుగుల వద్ద బిహార్ మూడో వికెట్ కోల్పోయాక ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన షకీబుల్ మిజోరాం బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
వరుసగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో సెంచరీ, డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 387 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేంట్రం చేసిన మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా షకీబుల్ గని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తం 405 బంతులు ఎదుర్కొన్న గని 56 ఫోర్లు, 2 సిక్స్‌లతో 341 పరుగులతో విశ్వరూపం చూపించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేంట్ర మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్ రోహెరా రికార్డును కూడా షకీబుల్ గని బద్దలు కొట్టాడు. 2018/19 రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్‌పై అజయ్ రోహెరా 267 పరుగులు చేసి ఇప్పటివరకు అరంగేంట్ర మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. కానీ తాజాగా ఆ రికార్డును షకీబుల్ గని బ్రేక్ చేశాడు. అంతేకాకుండా ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు బాబుల్ కుమార్‌తో కలిసి రికార్డు స్థాయిలో 399 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.