రిటైన్ పాలసీకి ఒప్పుకోకుండా జట్టును వీడిన స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం గట్టి షాకే ఇచ్చింది. లక్నో ఫ్రాంచైజ్ ఇచ్చిన భారీ రెమ్యునరేషన్ ఆఫర్ కోసం SRHను వీడిన రషీద్ ఖాన్ ప్లేస్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను టీమ్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం. అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో మెగా వేలానికి అశ్విన్ అందుబాటులో ఉండనున్నాడు. దీంతో అశ్విన్‌ను ఎంత ధరకైనా దక్కించుకుని రషీద్ ఖాన్‌కు గట్టి జవాబు ఇవ్వాలని SRH యాజమాన్యం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
2021 ఐపీఎల్‌లో రషీద్‌ఖాన్‌కు SRH రూ.9 కోట్లు చెల్లించింది. ఐపీఎల్ 2022 కోసం రషీద్‌ను రిటైన్ చేసుకునేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయత్నించగా.. అందుకు రషీద్‌ఖాన్ అంగీకరించలేదని సమాచారం. రషీద్‌ను రిటైన్ చేసుకోకపోవడంపై స్పందించిన SRH యాజమాన్యం.. కొత్త ఫ్రాంచైజ్ లక్నో.. రషీద్‌ఖాన్‌కు అధిక ధర ఆశ చూపి ప్రలోభానికి గురిచేసినట్లు ఆరోపించింది. ఇదే విషయమై బీసీసీఐకి ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు పేస్ బౌలర్ ఉమ్రన్ మాలిక్, హార్డ్ హిట్టర్ సమద్‌ను SRH రిటైన్ చేసుకుంది.
అధిక ధర కోసం జట్టును వీడిన రషీద్‌ఖాన్ చోటును టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్‌తో భర్తీ చేయనుంది. కాగా అశ్విన్ ఇప్పటి వరకు 167 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 145 వికెట్లు తీసి 456 పరుగులు కూడా చేశాడు. కాగా అశ్విన్ టీ20 క్రికెట్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. నవంబర్ 19న న్యూజిలాండ్‌తో రాంచీలో జరిగిన టీ20 మ్యాచ్‌లో అశ్విన్ 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. SRHకు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అశ్విన్ బలమవుతాడు. మరి SRH రషీద్ ఖాన్ ప్లేస్‌లో అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.