టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ బెబ్బులిలా రెచ్చిపోతోంది. తొలి వన్డేలో 1 వికెట్ తేడాతో గెలిచిన బంగ్లా సింహాలు.. రెండో వన్డేలో 5 పరుగులతో భారత్ ను ఓడించాయి. అయితే విదేశాల్లో పసికూనలా ఆడే బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో మాత్రం చెలరేగిపోతోంది. సొంత గడ్డపై బంగ్లా జట్టు రికార్డులు తిరగరాస్తోంది. ఏ జట్టుకైనా సొంత దేశంలో ఆడుతుంటే కొండంత బలం అనిపిస్తుంది. అదే ఆ జట్లకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ప్రస్తుతం బంగ్లా జట్టుకు జరుగుతుంది అదే. స్వదేశీ పిచ్ లపై ఉన్న అపారమైన అనుభవంతో బంగ్లా బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దాంతో సొంత గడ్డపై బంగ్లాను ఓడించడం ఓ సవాల్ అనే చెప్పాలి. ఇక బంగ్లాకు స్వదేశంలో ఉన్న గెలుపు రికార్డు ఆస్ట్రేలియాకు సైతం లేదు. బంగ్లాను బంగ్లాలో ఓడించలేమా? సొంత గడ్డపై బంగ్లా జట్టు ఆస్ట్రేలియా కంటే డేంజరా? రికార్డులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
క్రికెట్ లో హోం గ్రౌండ్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సొంత మైదానాల్లో ఆడుతుంటే ఆటగాళ్లకు ఎక్కడాలేని ఉత్సాహం వస్తుంది. ఆ ఎనర్జినే విజయాలకు దారితీస్తుంది. పైగా తరచుగా ఆడే గ్రౌండ్స్ కాబట్టి సహజంగానే పిచ్ కండీషన్ ఈజీగా తెలుస్తుంది ఆటగాళ్లకు. దాంతో ప్రత్యర్థి ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టొచ్చు. ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ చేస్తుంది ఇదే. అదీకాక బంగ్లాదేశ్ ను వారి సొంత గడ్డపై ఓడించడం ఓ సవాల్ అనే చెప్పాలి. ఇందుకు బంగ్లా గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ విషయంలో ఆస్ట్రేలియా జట్టు సైతం బంగ్లాదేశ్ వెనకాలే ఉండటం విశేషం. ఇక బంగ్లా గణాంకాల విషయానికి వస్తే..
— Hardin (@hardintessa143) December 8, 2022
2012 డిసెంబర్ నుంచి సొంత గడ్డపై 56 మ్యాచ్ లు ఆడిన బంగ్లాదేశ్ 71.42 శాతంతో 40 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. కేవలం 15 మ్యాచ్ ల్లోనే ఓడిపోయింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. సొంత గడ్డపై 57 మ్యాచ్ లు ఆడిన ఆసిస్.. 40 విజయాలు, 16 అపజయాలు సాధించింది. తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్, సౌతాఫ్రికాలు నిలిచాయి. ఈ వరసలో టీమిండియా 74 మ్యాచ్ ల్లో 47 విజయాలతో 6వ స్థానంలో నిలవడం గమనార్హం. ఈ క్రమంలోనే 2015 నుంచి బంగ్లాదేశ్ స్వదేశంలో 13 వన్డే సిరీస్ లు ఆడగా.. 12 సిరీస్ లను కైవసం చేసుకోవడం విశేషం. కేవలం ఒకే ఒక్క సిరీస్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది.
Bangladesh in home ODI series since 2015 World Cup:
Beat Pak
Beat Ind
Beat Sa
Beat Zim
Beat Afg
Lost to Eng
Beat Zim
Beat Wi
Beat Zim
Beat Wi
Beat Sl
Beat Afg
Beat IndWon 12 series from 13 – The domination.
— Johns. (@CricCrazyJohns) December 7, 2022
ఇక బంగ్లా చేతిలో ఓడిన జట్లలో పాక్, ఇండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, ఆఫ్గనిస్తాన్, వెస్టిండీస్ లు ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టే అర్థం చేసుకోవచ్చు సొంత గడ్డపై బంగ్లా ఎంత బలమైన జట్టో. ఇండియాతో జరిగిన రెండు మ్యాచ్ లను గమనిస్తే.. బంగ్లా బ్యాటర్లు పిచ్ పరిస్థితులను అర్దం చేసుకునే ఆడినట్లు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక సొంత అభిమనుల అరుపులు కూడా వారికి అడ్వాంటేజీ. అదీకాక గత కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సమష్టి ప్రదర్శనతో అద్బుతంగా రాణిస్తున్నారు.