క్రికెట్ లో అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. భారీ సిక్సర్లు, కళ్లు మైమరిపించే క్యాచులు, ఆటగాళ్ల మధ్య గొడవలు, అంపైర్లు తప్పిదాలు.. ఇలా ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ కోవకు చెందిందే ఈ వార్త. అంపైర్ చేసిన ఓ తప్పిదం.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను, స్టేడియంలో మ్యాచ్ తిలకిస్తోన్న అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ.. అంపైర్ చేశాడంటే.. బంతి, బ్యాట్ తగిలినా వైడ్ ఇవ్వలేదు. ఈ ఘటన బంగ్లాదేశ్ వేదికగా జరిగే ‘బీపీఎల్’ లీగ్ లో చోటుచేసుకుంది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగేవేగా అని మీకు సందేహం రావొచ్చు. అయితే, అంపైర్ ఇలా వైడ్ ఇవ్వడానికి ఒక బలమైన కారణముంది. అదేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతిని బ్యాటర్ ఆడేందుకు ప్రయత్నించడం, అది అండర్ ఎడ్జ్ తీసుకొని కీపర్ వైపుగా వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. బంతి బ్యాట్‌కు తగిలి నేలపై పడింది. ఇదంతా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అంపైర్ వైడ్ ఇచ్చాడు. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం ఫీల్డింగ్ జట్టులోని ఆటగాళ్లందరినీ ఆశ్చర్యపరిచింది. బౌలర్, కీపర్ తమ కళ్లను నమ్మలేకపోయారు. బౌలర్ ఈ విషయంపై.. అతనితో వారించినా వినలేదు. వైడ్ అంటే.. వైడ్ అంతే అన్నట్లుగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంపైర్ ఇలా వైడ్ ఇవ్వడానికి ఒక కారణముంది అందేంటంటే.. బాల్ కనపడకుండా బౌలర్ అడ్డురావడమే. బాల్ డెలివరీ చేసే సమయంలో బౌలర్ అంపైర్ కు అడ్డు రాకూడదు. ఇది ఒక నిబంధన. ఈ కారణంగానే అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
#Rip #BPL #BPL2023 pic.twitter.com/WieBRcB8Xy
— Osman Goni (@MdOsmanGoni05) January 8, 2023
ఈ వీడియో ప్రస్తుత సీజన్‌కు చెందినది కాదు. మునుపటి సీజన్‌కు చెందినది. పాత వీడియో ఇప్పుడెందుకు చర్చకు దారితీస్తోంది అని మీకు సందేహం రావచ్చు. అందుకు కారణం.. బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్. ఈ మధ్యనే బీపీఎల్ మూడో సీజన్ ప్రారంభమైంది. ఒక మ్యాచ్‌లో బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తల మీదుగా వెళ్తున్న బంతిని అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో షకీబ్ కు కోపం పొడుచుకొచ్చింది. సాధారణంగా అలాంటి బంతిని వైడ్ గా ప్రకటిస్తారు. కానీ, అంపైర్ అలా చేయలేదు. దీంతో ఆగ్రహించిన షకీబ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బీపీఎల్ లో అంపైర్ల నిర్ణయాలు ఇలా ఉంటాయి అని చెప్పడానికి అభిమానులు పాత వీడియోను మరోసారి పోస్ట్ చేస్తున్నారు. అంపైర్ నిర్ణయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A wide not given by the umpires makes Shakib Al Hasan furious. pic.twitter.com/KPgVWmYtrg
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2023