పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే పాకిస్థాన్ గెలవగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక ఈ సిరీస్ కైవసం చేసుకునేందుకు ఇరు జట్లు.. మూడో వన్డే ఎలాగైన గెలిచి తీరాలనే పట్టుదలతో బరిలోకి దిగాయి. శుక్రవారం కరాచీ వేదికగా ఈ రెండో దేశాల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే.. తొలి రెండు వన్డేలకు తుది జట్టులో తేని పాక్ వైస్ కెప్టెన్ షాన్ మసూద్ ఈ మ్యాచ్‌లో జట్టులోకి వచ్చాడు. కానీ.. డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ కేవలం 4 పరుగులకే అవుటై విఫలమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే అవుటై బాబర్ నిరాశ పరిస్తే.. మరో చెత్త రికార్డు మూటగట్టుకుని మరింత అవమానకర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న బాబర్ అజమ్.. ఈ వన్డే సిరీస్‌తో ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వరుసగా.. మూడు వన్డేల్లోనూ ఒకే విధంగా అవుటైన ప్లేయర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లోనూ బాబర్.. స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇలా ఒక సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ స్టంప్ అవుటైన ప్లేయర్‌గా బాబర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
తొలి మ్యాచ్‌లో 82 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 66 పరుగులు చేసిన బాబర్ అజమ్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. కీపర్ లాథమ్ వచ్చిన చిన్న అవకాశాన్ని సైతం అద్భుతంగా ఉపయోగించుకుని.. బాబర్‌ను పెవిలియన్ చేర్చాడు. అలాగే.. రెండో మ్యాచ్‌లో 114 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 79 పరుగులతో అద్భుతంగా ఆడిన బాబర్.. ఈ సారి ఇష్ సోధీ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. లాథమ్ మరోసారి తన కీపింగ్ స్కిల్స్‌తో బాబర్ అవుట్ చేశాడు. తాజాగా కరాచీ వేదికగా జరుగుతున్న సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లోనూ.. 13 బంతుల్లో ఒక ఫోర్‌తో 4 పరుగులు చేసిన బాబర్.. బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో వరుసగా మూడోసారి కూడా స్టంప్ అవుట్‌గానే పెవిలియన్ చేరాడు. దీంతో బాబర్ అజమ్ స్టంప్ అవుట్స్‌లో హ్యాట్రిక్ సాధించాడంటూ.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
haatrick for babar azam for stump out.
record maker babar pic.twitter.com/zf7B3E61Mj— ༄vk᭄♛Riju18᭄ ♛ (@RijuNandi9025) January 13, 2023