బాబర్ అజామ్.. నిన్న, మెున్నటి దాక వరల్డ్ క్లాస్ క్రికెట్ ప్లేయర్ గా ప్రశంసలు అందుకున్నాడు. కానీ నేడు తప్పు చేసిన వ్యక్తిగా పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ముందు నిలబడాల్సి వచ్చింది. దానికి కారణం సహచర క్రికెటర్ లవర్ తో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడాడు అంటూ బయటికి వచ్చిన వీడియో, సె*క్స్ చాటింగ్ కారణం. ఈ వీడియో, చాటింగ్ లు పాక్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు సృష్టించాయి. దాంతో బాబర్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడని అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా జట్టులో నుంచి కూడా తప్పించాలని పెద్ద ఎత్తున పాక్ లో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూడ్ వీడియో కాల్స్ పై నోరు విప్పాడు బాబర్ అజామ్. తనపై వార్తలు వచ్చిన కొద్ది సేపటికే ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
బాబర్ అజామ్.. ఇటు బ్యాటింగ్ లో రాణిస్తూ.. అటు సారథిగా పాక్ కు ఎన్నో విజయాలను అందించాడు. అదీకాక పాక్ టీమ్ ను అత్యున్నత దశకు తీసుకెళ్లాడు అని మాజీలు సైతం అతడిని ప్రశంసించారు. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు.. బాబర్ ఓ మోసగాడు, హనీ ట్రాప్ లో చిక్కుకుని నిందితుడిగా పాక్ క్రికెట్ అభిమానుల ముందు నిలుచున్నాడు. దానికి కారణం తన తొటి ఆటగాడి లవర్ తో సె*క్స్ చాట్ చేశాడని, న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడాడు అని అందుకు సంబంధించిన వీడియోలు, చాటింగ్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ విషయంపై వార్తలు రాగానే స్పందించాడు బాబర్ అజామ్.
The war against Babar Azam has started 😢#BabarAzam𓃵 #BabarAzam pic.twitter.com/JOSmHd9A32
— Muhammad Noman (@nomanedits) January 15, 2023
తన ట్విట్టర్ వేదికగా ఓ పిక్ ను షేర్ చేస్తూ.. ‘దీని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు.. సంతోషంగా ఉండండి’ అంటూ బ్రిడ్జి దగ్గర నవ్వుతున్న ఫోటోని పోస్ట్ చేశాడు. ఇక ఈ వివాదంపై పాక్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాబర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతుందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక గత కొంత కాలంగా సారథిగా ఘోరంగా విఫలం అవుతూ వస్తున్నాడు బాబర్. దాంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి షాన్ మసూద్ ను టెస్టులకు, వన్డేలకు కెప్టెన్ గా నియమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి చాటింగ్, న్యూడ్ వీడియో కాల్స్ పై బాబర్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Doesn’t take too much to be happy ☺️ pic.twitter.com/udKmZTHl6V
— Babar Azam (@babarazam258) January 16, 2023