కోల్‌కత్తా వేదికగా గురువారం భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు అక్షర్ పటేల్. రవీంద్ర జడేజాకు రీప్లేస్‌మెంట్‌గా స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులో కొనసాగుతున్న అక్షర్.. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటాడు. అయితే.. తాజాగా లంకతో రెండో మ్యాచ్‌లో తన ఫీల్డిండ్ విన్యాసంతో జడేజాను అన్ని విధాలా భర్తీ చేయగలను అంటూ.. చెప్పకనే చెప్పాడు. అక్షర్ పటేల్ పట్టిన ఆ క్యాచ్ చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు టీమిండియా బౌలర్, హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ మియా ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఆవిష్క ఫెర్నాండోను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు.
ఇక్కడి నుంచి 100 పరుగుల వరకు కేవలం 2 వికెట్లు కోల్పోయి శ్రీలంక.. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ చెలరేగడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా లంక ప్లేయర్ చమిక కరుణరత్నే పాయింట్ దిశగా ఆడిన షాట్‌ను అక్షర్ పటేల్ గాల్లోకి డైవ్ చేస్తూ.. దాన్ని ఎంతో అద్భుతంగా క్యాచ్‌గా మలిచాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన బంతిని పాయింట్ దిశగా ఎంతో బలంగా కొట్టాడు కరుణరత్నే. పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ దాన్ని పూర్తిగా గాల్లో డైవ్ చేస్తూ.. అందుకున్నాడు. అంతే.. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీమిండియా ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. అలా ఎలా అక్షర్ దాన్ని క్యాచ్ అందుకున్నాడో చాలా మందికి అర్థం కాలేదు. ఇక కరుణరత్నే అయితే.. అలాగే చూస్తుండిపోయాడు. ఇలా కరుణరత్నేను అక్షర్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.
మొత్తానికి శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ 3, కుల్దీప్ యాదవ్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు. అలాగే శుబ్‌మన్ గిల్ సైతం అద్భుత ఫీల్డింగ్‌తో ఒక రనౌట్ చేశాడు. ఇక ఈ నామమాత్రపు లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 64, హార్దిక్ పాండ్యా 36 పరుగులతో రాణించారు. అయితే.. ఈ మ్యాచ్ అక్షర్ పటేల్ 29 రన్స్ చేయడంతో పాటు ఒక వికెట్ తీసుకున్నాడు. ఇలా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన అక్షర్.. వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే.. అక్షర్‌కు వాషింగ్టన్ సుందర్‌తో పాటు టీమిండియా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాతో కూడా పోటీ నెలకొంది. సుందర్, అక్షర్, జడేజా.. బ్యాటింగ్ బౌలింగ్‌లో ఎలా పోటీ పడినా.. ఫీల్డింగ్ విషయంలో జడేజా ఒక మెట్టు పైనే ఉంటాడు. ఇప్పుడు అక్షర్ పటేల్ ఫీల్డింగ్ చేస్తూ.. ఆ లోటును కూడా భర్తీ చేసి… టీమిండియాకు జడేజా అవసరం లేదనిపించేలా అక్షర్ పటేల్ చేస్తున్నాడంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sharp catch alert 💥@akshar2026 dives to his left and takes a fine catch as @umran_malik_01 gets his second wicket 👌👌#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/R4bJoPXNM3
— BCCI (@BCCI) January 12, 2023