ఇండియా-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ వేడి అప్పుడే మొదలైపోయింది. ఈ నెల 9న నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లు నెట్ ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు పది రోజుల ముందుగానే భారత్‌లో ల్యాండైపోయి.. నెట్స్‌లో చెమటోడుస్తోంది. అశ్విన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ యాక్షన్ ఉన్న ఓ యువ క్రికెటర్‌ను తమ నెట్ బౌలర్‌గా నియమించుకుంది. మహేష్ పితియా అనే ఇండియన్ యువ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ సేమ్.. టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్‌ను పోలి ఉంది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ఈ మాస్టర్ ప్లాన్ వేసింది.
ఓ వైపు ఆస్ట్రేలియా తమ చిత్తులమారి ప్లాన్లతో ప్రాక్టీస్ చేస్తుంటే.. మరో వైపు టీమిండియా సైతం నెట్ ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. ఎందుకంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-0 లేదా 3-1తో ఓడిస్తేనే.. టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుతుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఫైనల్‌కు టీమిండియా రాకుండా అడ్డుకోవాలని చూస్తోంది. అలాగే 2004 నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సైతం వరుసగా రెండుసార్లు ఓడింది. ఈ చెత్త రికార్డులకు బ్రేక్ వేయాలని ఆస్ట్రేలియా గట్టి పట్టుదలతో ఉంది.
టీమిండియాను చూసి భయపడుతున్న ఆస్ట్రేలియా..
అయితే.. ప్రస్తుతం ఉన్న భారత జట్టును చూసి ఆస్ట్రేలియా భయపడుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పర్యటనకు ఆస్ట్రేలియా ఏకంగా 18 మంది ఆటగాళ్లతో వచ్చిందని, ఈ ఒక్క విషయం చాలు టీమిండియా అంటే ఆస్ట్రేలియా ఏ రేంజ్‌లో వణికిపోతుందో చెప్పడానికి అని కైఫ్ పేర్కొన్నాడు. అలాగే ఆస్టేలియా ఎంత బలమైన జట్టు అయినా.. ఇండియాలో స్పిన్‌ను ఎదుర్కొని నిలబడటం అంత తేలికైన పని కాదని, ఆ విషయం ఆస్ట్రేలియాకు సైతం తెలుసని అన్నాడు. అలాగే 2020లో గాబాలో జరిగిన టెస్టులో కోహ్లీ ఆడలేదని, ఇప్పుడు కోహ్లీ భీకరఫామ్‌తో టీమ్‌లో ఉన్నాడని కైఫ్ ఆసీస్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జడేజాల స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఆస్ట్రేలియా నిలబడలేదని, ఒక వేళ సమర్థ ఎదుర్కొంటే.. మంచి హోరాహోరీ పోరు చూడొచ్చని జోస్యం చెప్పాడు. మరి కైఫ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia have begun their preparations for the Border Gavaskar Trophy ahead of the 1st Test in Nagpur.#INDvAUS pic.twitter.com/21NlHzLwGA
— BCCI (@BCCI) February 3, 2023
How are the Aussies preparing for @ashwinravi99 ahead of their upcoming Test series with India? Well, they’ve only gone and flown in a near carbon copy of the star off-spinner as a net bowler | #INDvAUS pic.twitter.com/l9IPv6i43j
— cricket.com.au (@cricketcomau) February 3, 2023