ఆసియా కప్ 2022లో అసలు సిసలైన క్రికెట్ మ్యాచ్ బుధవారం జరిగింది. సూపర్ ఫోర్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ అంచనాలకు మించి రాణించింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 129 పరుగులు మాత్రమే చేసినా.. తమ బౌలింగ్ ఎటాక్‌తో పాకిస్థాన్‌ను గడగడలాడించింది. ఒక వైపు నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ సాగుతుంటే.. మరోవైపు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధంతో మరింత వేడి పెరిగింది. 19వ ఓవర్‌లో పాక్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ, ఆఫ్ఘాన్ స్పీడ్ స్టార్ ఫరీద్ అహ్మెద్ గ్రౌండ్‌లోనే కొట్టుకున్నంత పని చేశారు. పాకిస్థాన్ విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన సమయంలో.. పాక్ సులువుగా గెలుస్తుందని అనిపించింది.
కానీ.. 18వ ఓవర్‌లో ఆఫ్ఘాన్ స్టార్ పేసర్ ఫారూఖీ అద్భుతం చేశాడు. 18వ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి నవాజ్, కుష్‌దిల్‌ను అవుట్ చేసి.. మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. 19వ ఓవర్‌ను ఫరీద్ మరింత అద్భుతంగా వేశాడు. తొలి బంతికి ఒక పరుగుల ఇచ్చి రెండో బంతికి వికెట్ తీస్తాడు. కానీ.. పాక్ పవర్ హిట్టర్ నాలుగో బంతికి భారీ సిక్స్‌బాది తానింకా క్రీజ్‌లో ఉన్న విషయాన్ని ఆఫ్ఘాన్‌కు అర్థమయ్యేలా చెబుతాడు. కానీ.. తర్వాత బంతికే ఫరీద్ అతన్ని అవుట్ చేయడంతో ఆఫ్ఘాన్ శిబిరంలో ఒక్కసారిగి విజయ ధ్వనులు వినిపిస్తాయి. కీలక సమయంలో తీవ్ర ఒత్తిడిలో వికెట్ తీసిన ఆనందంతో సంబురాలు చేసుకుంటున్న ఫరీద్, అవుటైన ఆసిఫ్ అలీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అవుటైన కోపంలో ఆసిఫ్.. ఫరీద్‌పై ఏకంగా బ్యాట్ ఎత్తుతాడు. ఇద్దరు కొట్టుకునేంత పని చేశారు. కానీ.. ఇతర ఆటగాళ్లు, అంపైర్ మధ్యలో రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
చివరి ఓవర్‌లో ఎవరూ ఊహించని విధంగా నసీమ్ షా రెండు వరుస సిక్సులతో పాకిస్థాన్ గెలిపించాడు. ఇంత తీవ్ర ఒత్తిడిలో పాక్‌ను గెలిపించిన నసీమ్ షా ఒక రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. పాక్ ఆటగాళ్లు సైతం ఆసియా కప్ గెలిచినంత సంబురపడి మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు. ఈ మ్యాచ్ చివరి ఐదు ఓవర్లు చూస్తే.. గతంలో ఇండియా-పాకిస్థాన్ తలపడినట్లు అనిపిస్తుంది. ఆఫ్ఘాన్ ఎంతో కసిగా ఆడింది. కానీ.. ఫారూఖీ ఒత్తిడికి చిత్తైయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది. ఇబ్రహీం జద్రాన్ 35 పరుగులతో రాణించాడు. చివర్లో రషీద్ ఖాన్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో పర్వాలేదనిపించాడు. ఈ స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో ఆసిఫ్ అలీ, ఫరీద్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: మ్యాచ్ తర్వాత స్టేడియంలో పొట్టుపొట్టు కొట్టుకున్న పాక్-ఆఫ్ఘాన్ ఫ్యాన్స్
If haramkhor had a face 🤦🏻♂️ tameez naam ki chiz nhi es me pic.twitter.com/CR66rEqy8A
— Rehman Khan 🇵🇰 (@Rehmankhan49) September 7, 2022