మూడో టెస్టులో టీమిండియా ఘోరంగా ఆలౌట్ కావడానికి అశ్విన్ కారణమా? అవును సోషల్ మీడియాలో అదే టాక్ వినిపిస్తుంది. మ్యాచ్ కు ముందే ఆ హింట్స్ ఇవ్వడంతోనే ఇలా జరిగిందని మాట్లాడుకుంటున్నారు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్ని తలో మూడు రోజుల్లోనే ముగించేసిన మన జట్టు.. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మాత్రం చతికిలపడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 109 పరుగులకే ఆలౌటైపోయింది. ఇండోర్ పిచ్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఆసీస్ స్పిన్నర్లు కునెమన్, లైయన్, మర్ఫీ.. మన బ్యాటర్లని తెగ ఇబ్బందిపెట్టేశారు. అయితే ఇలా జరగడానికి అశ్విన్ చేసిన ఓ పనే కారణమని పలువురు నెటిజన్స్ అంటున్నారు. మరి ఇందులో నిజమెంత?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో టెస్టుల్లో టీమిండియాకు ఇలా జరగలేదు. మరీ 109 పరుగులకు ఆలౌట్ అయ్యేసరికి అందరూ అవాక్కైపోయారు. అయితే తొలి రెండు టెస్టుల్లో వికెట్లే తీయడానికి ఇబ్బందిపడ్డ ఆసీస్ స్పిన్నర్లు మూడో టెస్టుకు వచ్చేసరికి ఇలా చెలరేగిపోవడం ఏంటా అని అందరూ తెగ ఆలోచించారు. దీనికి పలు కారణాలు కనిపించాయి. స్మిత్ కెప్టెన్ కావడం, భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయడం.. ఇలా పలు కారణాలు వినిపించినప్పుటికీ అసలు కారణం మాత్రం అశ్విన్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ప్రారంభానికి సరిగ్గా మూడు రోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో భాగంగా ‘టీమిండియాపై స్పిన్ ఎలా ఆడాలి?’ అని ఓ వీడియో చేశాడు. ఇందులో భాగంగా మన దేశంలో ఆయా ప్రాంతాల్లో పిచ్ ల పరిస్థితి ఎలా ఉంటుంది. ప్రత్యర్థి జట్టు ఎలా ఆడాలి. ఏమేం చేయాలి లాంటి విషయాల్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. తొలిరోజు పిచ్ బాగా టర్న్ అవుతుందని, ఆ టైంలో తొందరపడి ఆడేయకుండా పిచ్ ని అర్థం చేసుకోవాలని అన్నాడు. భారత దేశంలో ఉదయం పూట పిచ్ లు చాలా నెమ్మదిగా ఉంటాయని, రాత్రికి వచ్చేసరికి మారిపోతాయని వాటి మధ్య డిఫరెన్స్ చెప్పుకొచ్చాడు. ఇలా చాలావరకు హింట్స్ ఇచ్చేసరికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలెర్ట్ అయిపోయారని అనిపిస్తుంది. అశ్విన్ చేసిన ఈ పనివల్లే టీమిండియా ఇంత త్వరగా ఆలౌట్ అయిపోయిందా అనే డౌట్ కూడా పలువురు నెటిజన్స్ కి వచ్చింది. మరి టీమిండియా కొంపముంచిన అశ్విన్ అని వస్తున్నదానిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.