వీరబాదుడికి పెట్టింది పేరైన కరేబియన్ వీరుడు రస్సెల్ మరోసారి తన పవరేంటో చూపించాడు. బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్ రెనెగేట్స్ తరఫున ఆడుతున్న రస్సెల్.. తన పవర్ హిట్టింగ్‌తో దుమ్ములేపాడు. బుధవారం బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రస్సెల్.. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న రెనెగేట్స్‌ను ఆదుకున్నాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రస్సెల్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 57 పరుగులు చేసి విజయానికి కొద్ది దూరంలో అవుట్ అయ్యాడు. రస్సెల్ ఇన్నింగ్స్‌తోనే రెనెగేట్స్ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. అయితే.. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సిక్సులు బాదిన రస్సెల్.. అందులో 103 మీటర్ల ఒక సిక్స్ అయితే ఏకంగా స్టేడియం బయటికి వెళ్లి పడింది. ప్రస్తుతం రస్సెల్ కొట్టిన ఆ సిక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బెన్ హీట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రెనెగేట్స్ బౌలర్లు చెలరేగడంతో బ్రిస్బెన్ హీట్ తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. టామ్ రోజర్స్ 4, హుస్సేన్ 3 వికెట్లతో బ్రిస్బేన్ బ్యాటర్లను వణికించారు. బ్రిస్బెన్ బ్యాటర్లలో జిమ్మి పీర్సన్ 30 బంతుల్లో 45 పరుగులతో రాణించడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అయితే 138 పరుగుల నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన రెనెగేట్స్‌ను సైతం బ్రిస్బెన్ బౌలర్లు వణికించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే రెనెగేట్స్ ఓపెనర్ సామ్ హార్‌పర్‌ను అవుట్ చేసిన నెసర్.. రెనెగేట్స్‌కు ఊహించని షాకిచ్చాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి మరో వికెట్ తీసి.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.
తన రెండో ఓవర్‌గా ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన నెసర్.. తొలి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టి.. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసినందుకు హ్యాట్రిక్ సాధించాడు. దీంతో రెనెగేట్స్ 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో క్రీజ్‌లోకి వచ్చిన రస్సెల్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. బ్రిస్బెన్ బౌలర్లపై విరుచుకుపడి 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. రెనెగేట్స్‌ను విజయ దిశగా నిడిపించాడు. 42 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 57 పరుగులు చేసిన రస్సెల్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హుస్సేన్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేయడంతో.. రెనెగేట్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో రస్సెల్ పవర్ హిట్టింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dre Russ has hit it out of the ground…literally 🤯#BBL12 #GETONRED pic.twitter.com/jMO6VWzLDg
— Melbourne Renegades (@RenegadesBBL) December 21, 2022