తమపై ఫోకస్ పెంచుకునేందుకు, ఫేమస్ అవ్వడానికి కొంతమంది నటీనటులు అర్ధనగ్నంగా, పూర్తి నగ్నంగా ఫొటో షూట్‌లతో పాల్గొంటూ ఉంటారు. ఇటివల బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్ నగ్నంగా ఫొటో షూట్‌లో పాల్గొని విమర్శల పాలయ్యాడు. అలాగే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం నగ్నంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించాడు. చాలా మంది ఇలాంటి ఫొటోలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సరే వీరంటే సినిమా రంగంలో ఉన్నవారు.. ప్రమోషన్స్ కోసమో, పాపులారిటీ కోసమో అలా చేశారని అనుకోవచ్చు. కానీ.. ఒక స్టార్ క్రికెట్ కూడా వారి దారిలోనే వెళ్లాడు.
అంతర్జాతీయంగా పాపులర్ అయిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ నగ్నంగా సెల్ఫీ దిగి.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్‌లో పెట్టాడు. క్షణాల్లోనే ఆ ఫొటో వైరల్ అయింది. దాంతో ఆ ఫొటోను రస్సెల్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి ఫొటోను రస్సెల్ పోస్టు చేయడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ క్రికెటర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న క్రికెటర్‌కు ఇదేం పోయే కాలం ఇలాంటి ఫొటోలు పెడుతున్నాడంటూ మండిపడుతున్నారు. కాగా.. రస్సెల్ నిజంగానే ఆ ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టాడా? లేక పోరపాటున అది పోస్ట్ అయిందా? అసలు అది నిజంగా రస్సెల్ ఫొటోనేనా? లేక మార్ఫింగ్ చేశాడా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.
అయితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్ ప్లేయర్‌గా ఎదిగిన రస్సెల్.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న దాదాపు అన్ని ఫ్రాంచైజ్ లీగులు ఆడుతున్నాడు. కానీ.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో ఉన్న విభేదాల కారణంగా జాతీయ జట్టుకు మాత్రం ప్రాతినిథ్యం వహించడం లేదు. ఈ విషయంలో రస్సెల్, సునీల్ నరైన్ లాంటి క్రికెటర్లపై విమర్శలు కూడా ఉన్నాయి. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లోనూ రస్సెల్ వెస్టిండీస్ జట్టు తరఫున ఆడలేదనే విషయం తెలిసిందే. అలాగే వెస్టిండీస్ జట్టు కూడా అత్యంత దారుణంగా పసికూనల చేతిలో ఓడి.. గ్రూప్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కనీసం సూపర్ 12కు కూడా అర్హత సాధించలేకపోయింది.
#Andrewrussell pic.twitter.com/NC7ETVBfwV
— Sekhar Rambo (@RamboSekhar) November 18, 2022