ఐపీఎల్ 2022 కోసం అన్ని జట్లు కొందరు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. రానున్న సీజన్‌కు ముందు ఫిబ్రవరీలో ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు, యువ క్రికెటర్లు అందుబాటులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రాయుడు గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు. ఐపీఎల్-2022 సీజన్‌కు సీఎస్‌కే రాయుడిని రిటైన్ చేసుకోలేదు.
అయితే, తనకు మాత్రం ఐపీఎల్‌లో మరో మూడేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాలని ఉందని రాయుడు వెల్లడించాడు. మెగా వేలంలో సీఎస్‌కేనే తనను కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నట్లు రాయుడు పేర్కొన్నాడు. 2021 సీజన్‌లో విజయం సీఎస్‌కేకు చాలా ప్రత్యేకమైనదని, ఆ విజయంలో తన వంతు పాత్ర పోషించినట్లు పేర్కొన్నాడు. తానేంటో నిరూపించుకోవడానికి సీఎస్‌కే గొప్ప అవకాశం కల్పించినట్లు వెల్లడించాడు. కాగా 2021 సీజన్‌లో రాయుడు 257 పరుగులు సాధించాడు. మరి రాయుడు బయటపెట్టిన అతని మనుసులోని మాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.