టాప్ క్లాస్ బౌలర్లపై ఒక 21 ఏళ్ల కుర్ర బ్యాటర్ విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదేశాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో ఈ సంచలనం చోటు చేసుకుంది. పుజారా కెప్టెన్సీలోని ససెక్స్ టీమ్ ఓపెనర్ అలీ ఓర్ బౌలర్లను ఊచకోత కోశాడు. 161 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సులతో 206 పరుగులు చేశాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా శుక్రవారం సోమర్‌సెట్-ససెక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ససెక్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ అలీ డబుల్ సెంచరీతో చెలరేగడం, కెప్టెన్ పుజారా, రాలిన్స్ అర్ధసెంచరీలతో రాణించడంతో ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 397 పరుగుల భారీ స్కోర్ చేసింది.
లక్ష్యఛేదనకు దిగిన సోమర్‌సెట్ 38.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ససెక్స్ 201 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో రాణించిన అలీ ఓర్ ఇంగ్లండ్ చెందిన ఆటగాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. ప్రస్తుతం అతని ఫామ్ చూస్తుంటే త్వరలోనే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 2001 ఏప్రిల్ 6న జన్మించిన అలీ ఓర్ అతి పిన్న వయసులో వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పుజారా సాధించాడు! కోహ్లీకి ఎందుకు సాధ్యం కావడం లేదు?
💯 ❎ 2️⃣
What a moment for Ali Orr 👏👏#RLC22 pic.twitter.com/yEcXnTsUZD
— Royal London Cup (@RoyalLondonCup) August 19, 2022