ప్రతిభకు అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, టెస్టు స్పెషలిస్ట్ రహానేని చూస్తే అర్ధం అవుతుంది. ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో స్థానం సంపాదించిన రహానే.. అక్కడ రాణించి ఏకంగా వెస్టిండీస్ సిరీస్ కి వైస్ కెప్టెన్ గా నియమించబడ్డాడు.
ఒక్కసారి టీంఇండియాలో చోటు కోల్పోతే రీ ఎంట్రీ ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక టెస్టు జట్టులో పునరాగమనం అంటే అది అసాధ్యం అనే చెప్పాలి. 17 నెలల క్రితం జట్టులో స్థానం కోల్పోయిన అజింక్య రహానే పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో రహానే తన పునరాగమనాన్ని చాటుకున్నాడు. బహుశా ఇలాంటి రీ ఎంట్రీ కేవలం రహానేకు మాత్రమే సాధ్యమనేలా చాటి చెప్పాడు. ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో స్థానం సంపాదించిన రహానే.. అక్కడ రాణించి ఏకంగా వెస్టిండీస్ సిరీస్ కి వైస్ కెప్టెన్ గా నియమించబడ్డాడు. మరి రహానే కంబ్యాక్ ఏ విధంగా సాగిందో ఇపుడు చూద్దాం.
ప్రతిభకు అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో రహానేని చూస్తే అర్ధం అవుతుంది. ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా విరాట్ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందించి అందరి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ సిరీస్ అనంతరం రహానేకి బ్యాడ్ టైం నడిచింది. పేలవ ఫామ్ తో జట్టుకి భారంగా మారాడు. ప్రతి సిరీస్ లో ఫెయిల్ అవుతూ జట్టులో స్థానం కోల్పోయాడు. సౌతాఫ్రికా టూర్ తర్వాత టెస్టుల్లో చోటు కోల్పోయిన అజింకా రహానే, 17 నెలల తర్వాత ఐపీఎల్ 2023 పర్ఫామెన్స్ కారణంగా టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రహానే రీఎంట్రీకి ప్రధాన కారణం మాత్రం శ్రేయాస్ అయ్యర్ గాయమే అని చెప్పుకోవాలి.
రహానే ప్లేస్ లో అయ్యర్ కి వచ్చిన ఛాన్స్ ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఇక రహానే టెస్టు కెరీర్ అయిపోయిందని భావించారు. అయితే అయ్యర్ ఐపీఎల్ కి ముందు అనూహ్యంగా గాయపడడం రహానేకి కలిసి వచ్చింది. ఐపీఎల్ లో స్టోక్స్, మొయిన్ అలీ గాయపడడంతో చెన్నై జట్టు తరపున ఆడుతూ తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఈ ప్రదర్శన కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానేకి ఛాన్స్ లభించింది. పైగా ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం కూడా రహానేకు కలిసి వచ్చింది. దీంతో లక్కీగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడేసే ఛాన్స్ కొట్టేసాడు. అంతేకాదు ఈ ఫైనల్లో భారత్ తరపున రెండు ఇన్నింగ్స్ లో కలిపి 135 పరుగులు చేసాడు. భారత్ తరపున రహానే ఎక్కువ పరుగులు చేయడం గమనార్హం. ఇక ఈ ప్రదర్శనతో తాజాగా వెస్టిండీస్ జట్టులో స్థానం సంపాదించడమే కాకుండా వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేసాడు. ఒకప్పుడు టెస్టుల్లో వైస్ కెప్టెన్ గా ఉన్న రహానే.. తన పొజిషన్ ని కాపాడుకున్నాడు. మొత్తానికి ఇక కెరీర్ అయిపోయింది అనుకున్న తరుణంలో జట్టులో చోటు సంపాదించి ఒక్క టెస్టు మ్యాచ్ కే వైస్ కెప్టెన్ అయిపోయాడు. రహానే తన ఫామ్ ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.