క్రికెట్ లో ఎన్నో నిబంధనలు ఉంటాయి. కానీ అవన్ని ఆటగాళ్లకు పూర్తిగా తెలీవు. కొన్ని కొన్ని విచిత్రమైన అవుట్లు జరిగినప్పుడే నిబంధనలు వెలుగులోకి వస్తాయి. ఇక క్రికెట్ లో అరుదైన అవుట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. కచ్చితంగా ‘మన్కడింగ్’ అవుట్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. దీనికి ఆద్యుడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అనే చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ ను అవుట్ చేయడం ద్వారా దీనిని వెలుగులోకి తెచ్చాడు. ఇక అప్పటి నుంచి పలు సందర్భాల్లో ఇది చాలా మంది క్రికెటర్లు వాడారు కూడా. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో కూడా మన్కడింగ్ జరిగింది. కానీ ఇక్కడ బ్యాట్స్ మెన్ అవుట్ కాలేదు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు బ్యాట్ తో సత్తా చాటితే.. మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు తమ సత్తా చూపిస్తున్నారు. ఇక తాజాగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్బోర్న్ రినేగాడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మెల్బోర్న్ రినేగాడ్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు ఆధిపత్యం చలాయించిన ఈ మ్యాచ్ లో లో స్కోరింగ్ నమోదు అయింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ ఆడమ్ జంపా బౌలింగ్ చేస్తున్న క్రమంలో ఇది చోటు చేసుకుంది. మెల్బోర్న్ రెనేగాడ్స్ ఇన్నింగ్ చివరి ఓవర్ అది. క్రిజ్ లో హార్వే, టామ్ రోజర్ లు ఉన్నారు. ఈ క్రమంలోనే చివరి ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేయడానికి వచ్చాడు కెప్టెన్ జంపా. స్ట్రైకింగ్ లో హార్వే ఉండగా.. నాన్ స్ట్రైకింగ్ లో రోజర్ ఉన్నాడు.
Scenes at the MCG!
Adam Zampa just ran out Tom Rogers at the non-striker’s end, only for the third umpire to overrule it 😮
(📹 via @BBL) #BBL12 pic.twitter.com/mmxfqpNl59
— ESPNcricinfo (@ESPNcricinfo) January 3, 2023
ఈ క్రమంలోనే చివరి ఓవర్ ఐదవ బంతిని జంపా వదల బోయాడు కానీ వదలలేదు. అప్పటికే రోజర్ క్రీజ్ దాటి వెళ్లిపోయాడు. జంపా వెంటనే మన్కడింగ్ చేసి అతడిని అవుట్ చేశాడు. దాంతో బ్యాట్స్ మెన్ పెవిలియన్ వెళ్లడానికి రడీ అయ్యాడు కానీ ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ కు రిఫర్ చేయడంతో థర్డ్ అంపైర్ రివ్యూ చేశాడు. రివ్యూ లో అసలు విషయం తెలిసింది. అడమ్ జంపా చేసింది ఓవర్ రూల్ అని థర్డ్ అంపైర్ తేల్చి చెప్పాడు. అసలు రోజర్ ను ఎందుకు అవుట్ గా ప్రకటించలేదు ఎందుకంటే.. నిబంధనల ప్రకారం బౌలర్ మన్కడింగ్ చేస్తే.. చేయిని పూర్తిగా తిప్పకూడదు. కానీ ఇక్కడ అడమ్ జంపా బౌలింగ్ యాక్షన్ ను పూర్తి చేశాడు. దాంతో ఇది నిబంధనలకు విరుద్దం అని థర్డ్ అంపైర్ భావించి రోజర్ ను నాటౌట్ గా ప్రకటించాడు. ఇక ఈ మ్యాచ్ లో మెల్బోర్న్ స్టార్స్ నడ్డి విరిచాడు రోజర్. తన అద్బుతమైన బౌలింగ్ లో 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు.
Spicy, spicy scenes at the MCG.
Not out is the call…debate away, friends! #BBL12 pic.twitter.com/N6FAjNwDO7
— KFC Big Bash League (@BBL) January 3, 2023