గొప్ప గొప్ప క్రికెటర్లు తప్పిస్తే.. మూడు పదుల వయసులో పడితే ఆటకు వీడ్కోలు చెప్పేందుకు సమయం దగ్గర పడినట్లే లెక్క. కానీ నాలుగు పదుల వయసుకు ఒక్క ఏడాది దూరంలో ఉండి కూడా యువ క్రికెటర్లను మించి దూకుడు చూపిస్తుంది టీమిండియా ఉమెన్స్ టీమ్ కెప్టెన్, ఉమెన్స్ టీమ్ రన్ మెషీన్ మిథాలీ రాజ్. ఈ క్రమంలో తన విధ్వంసకర ఆటతో లేట్ వయసులో సైతం అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది. మిథాలీరాజ్ ఇటీవల ఆడిన చివరి 12 మ్యాచ్‌లను గమనిస్తే ఈ మహిళా బ్యాటర్ ఏ రేంజులో చెలరేగుతుందో అర్థమవుతుంది.
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తన చివరి 12 మ్యాచ్‌లో మిథాలీ రాజ్ ఏకంగా 8 సార్లు 50 పైగా పరుగులు సాధించింది. ఇందులో అత్యధిక స్కోర్ 79గా ఉంది. కాగా గత 12 మ్యాచ్‌ల్లో మిథాలీ వన్డే స్కోర్లను గమనిస్తే వరుసగా 57*, 30, 23, 66*, 59, 16, 8, 63, 75 *, 59, 72, 79గా ఉన్నాయి. మొత్తంగా గత 12 ఇన్నింగ్స్‌ల్లో మిథాలీ రాజ్ 50 సగటుతో 607 పరుగులు చేసింది. వరుసగా చివరి ఐదు మ్యాచ్‌లలోనూ మిథాలీ హాఫ్ సెంచరీలతో అదరగొట్టింది. దీంతో 4 పదుల వయసులోనూ అదరగొడుతున్న మిథాలీరాజ్‌పై క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తుంది. అభిమానలతోపాటు క్రీడా విశ్లేషకులు మిథాలీ రాజ్ ఆటకు ఫిదా అయిపోతున్నారు. కాగా త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మిథాలీ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు 224 వన్డే మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్ 51 సగటుతో 7,569 పరుగుల చేసింది. ఇందులో 7 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 125* పరుగులుగా ఉంది. ఇక 89 టీ20 మ్యాచ్‌ల్లో 37 సగటుతో 2364 పరుగులు చేసింది. ఇందులో 17 హాఫ్ సెంచరీలు ఉండగా అత్యధిక స్కోర్ 97* గా ఉంది. అలాగే 12 టెస్టు మ్యాచ్‌ల్లో 43 సగటుతో 699 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓ సారి డబుల్ సెంచరీ సాధించింది. అత్యధిక స్కోర్ 214గా ఉంది. మరి మిథాలీ సూపర్ ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mithali Raj in the last 12 ODI matches:
57*(66)
30(28)
23(33)
66*(81)
59(73)
16(28)
8(23)
63(107)
75*(86)
59(92)
72(108)
79(104)8 fifty plus scores in last 12 innings – The run machine Mithali Raj, at the age of 39, she continues to dominate world cricket.
— Johns. (@CricCrazyJohns) February 24, 2022