ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడేళ్ల తర్వాత సీఎం జగన్ తొలిసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. రాజన్న బిడ్డ తొలిసారి సీఎం హోదాలో తమ ప్రాంతంలో పర్యటిస్తున్నారని తెలియడంతో.. ఆయనను చూడటం కోసం జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు. జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. జై జగన్, జై జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. సుమారు 33 ఏళ్ల పాటు చంద్రబాబు అడ్డగా ఉన్నా కుప్పంలో.. జగన్‌కు ఇంత ఆదరణ లభించడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. సీఎం సభకు తరలివచ్చిన జనాలను చూస్తే.. ఇది పులువెందులా.. లేక కుప్పమా అనే అనుమానం రాక మానదు. అడుగడునా రాజన్న బిడ్డకు నీరాజనాలు పలుకుతూ.. సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ పర్యటనకు ఇంత భారీ ఎత్తున జనాలు తరలి రావడంతో.. టీడీపీ శ్రేణులు భయంతో వణికిపోతున్నారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. కుప్పంలో టీడీపీ గెలుపు కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కుప్పం పర్యటనలో భాగంగా వైస్సార్ చేయూత మూడో విడత నిధులు విడుదల చేశారు సీఎం జగన్. అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్.. కుప్పంకు నాన్ లోకల్. ఆయన ఇల్లు ఉంది హైదరాబాద్‌లో. కుప్పం అంటే ఇవాళ చంద్రబాబు పాలన కాదు.. నా అక్కచెల్లమ్మల అభివృద్ధి అని తెలిపారు సీఎం జగన్. ఇదే వేదిక మీదుగా పెన్షన్‌ను 2,750 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని’’ సీఎం జగన్ తెలిపారు. ఇక సభకు హాజరైన జనాలు కొన్ని నిమిషాల పాటు.. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. మరి కుప్పంలో జగన్‌పై ప్రజలు చూపిస్తోన్న ప్రేమాభిమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) September 23, 2022