ఈరోజుల్లో చిరు ఉద్యోగాలు చేసుకునే వారికే సొంత ఇళ్ళు ఉంటున్నాయి. ఇక రాజకీయ నేతల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకూ ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్ళు ఉంటాయి. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇప్పటి వరకూ ఒక సొంత ఇల్లు లేదని చెబుతున్నారు.
గెలుపొందిన పార్టీకి చెందిన రాజకీయ నేతలు అధికారిక నివాసంలో ఉంటారు. ఈ క్రమంలో సొంత ఇళ్ళలో ఉండేది తక్కువ. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అధికారిక నివాసం నుంచి బయటకు వచ్చేయాలి. ఈ క్రమంలో తాము కూడా అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి బయటకు వచ్చేశామని రాహుల్ గాంధీ అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సొంత ఇల్లు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత.. అంత పెద్ద నేత అయినప్పుడు సొంతంగా ఒక ఇల్లు ఉండదా? అని చాలా మందికి అనుమానం వస్తుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం సొంత ఇల్లు లేదని అంటున్నారు. ఇప్పటికీ తనకంటూ ఒక సొంత ఇల్లు లేదని అన్నారు.
ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1977 ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనను రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. అప్పుడు రాహుల్ గాంధీకి ఆరు, ఏడేళ్లు ఉంటాయి. ఆ సమయంలో ప్రభుత్వ అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్నారు. అయితే ఆ సంఘటన ముందు వరకూ ఆ ఇల్లు మాదే అనుకున్నానని ఆయన అన్నారు. తను మరియు తన కుటుంబ సభ్యులు ఉండే ప్రభుత్వ నివాసాన్ని తమదే అని అనుకునేవాడినని, అయితే ఆ ఇల్లు తమది కాదు అన్న విషయం ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు తన తల్లి చెప్పిందని వెల్లడించారు. ఇల్లు ఖాళీ చేసే సమయంలో అమ్మ దగ్గరకు వెళ్లి అడిగానని.. అయితే మనం ఇల్లు ఖాళీ చేసేస్తున్నామని అమ్మ చెప్పిందన్నారు.
ఇది మన ఇల్లు కాదని, ప్రభుత్వానిదని, అందుకే ఖాళీ చేస్తున్నామని అన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత తాను ఒక్కసారిగా అవాక్కయ్యానని అన్నారు. అయితే తర్వాత ఎక్కడికి వెళ్తాం అని అమ్మను అడిగితే తెలియదు అని అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాకిప్పుడు 52 ఏళ్ళు అని, ఇప్పటికీ సొంతంగా ఒక ఇల్లు కూడా లేదని అన్నారు. ప్రస్తుతం అలహాబాద్ లో తుగ్లక్ 12వ వీధిలో నివసిస్తున్నానని.. అయితే ఆ ఇల్లు తనది కాదని అన్నారు. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మా కేసీఆర్ ని అడిగితే డబుల్ బెడ్ రూమ్ ఇల్లే ఇచ్చేవాడు కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికీ సొంత ఇల్లు లేదని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
एक दिन घर में अजीब सा माहौल था, उस वक्त मैं 6 साल का था।
मैंने मां से पूछा- क्या हुआ?
बताया गया कि हम घर छोड़कर जा रहे हैं क्योंकि वह घर हमारा नहीं, सरकार का है।
मैंने मां से पूछा, कहां जाना है, कहती हैं- नहीं मालूम।
52 साल हो गए हैं, मेरे पास घर नहीं है।
: @RahulGandhi जी pic.twitter.com/2JXIE458EP
— Congress (@INCIndia) February 26, 2023