అక్కినేని ఫ్యామిలీపై నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం పరిస్థితి అక్కినేని వర్సెస్ బాలకృష్ణ అన్నట్లుగా తయారైంది. అక్కినేని ఫ్యామిలీనుంచి కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపాటు వ్యక్తం అయింది. మంగళవారం అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ దీనిపై స్పందించారు. అక్కినేనిపై వ్యాఖ్యలు చేయటాన్ని వారు తప్పు బట్టారు. ఈ ఇద్దరు తమ ట్విటర్ ఖాతాల్లో పోస్టులు పెట్టారు. ‘‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం…’’ అంటూ పేర్కొన్నారు. అక్కినేని అభిమానులు కూడా బాలయ్య బాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య బాబు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ అక్కినేని.. తొక్కినేని వ్యాఖ్యలపై తాజాగా రోజా స్పందించారు. ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘‘ అక్కినేనిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు తప్పు. అవే వ్యాఖ్యలు ఎన్టీఆర్‌పై చేస్తే.. ఆ ఫ్యామిలీ ఎలా బాధపడుతుందో చూడాలి’’ అని అన్నారు. కాగా, బాలకృష్ణ రెండు రోజుల క్రితం ‘‘వీరసింహారెడ్డి’’ సక్సెస్ మీట్ పాల్గొన్నారు. ఈ సందర్భగంగా ‘‘ అక్కినేని.. తొక్కినేని’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ కానీ, బాలకృష్ణ తరపునుంచి కానీ, ఎలాంటి వివరణ రాలేదు. మరి, అక్కినేనిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు తప్పని రోజా అనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.