Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుక్రవారం జగనన్న వసతి దీవెన రెండో విడత కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు, ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తన మీద కడుపు మంట పెరిగిపోయి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నన్ను కదిలించలేవు. నన్ను బెదిరించలేవు. మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదం ఉన్నంతవరకు వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు..’ అంటూ ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
ట్విటర్ వేదికగా వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. ‘‘ గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ వైఎస్ జగన్ గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నారు. అయినా నా మాట విని మీరే గుండు కొట్టించేసుకోండి .. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్, నారా లోకేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ @ysjagan గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం.(1/2) pic.twitter.com/ovLSHLc9EC
— Lokesh Nara (@naralokesh) April 8, 2022
ఇవి కూడా చదవండి : ప్రతిపక్షాల పై నిప్పులు చెరిగిన సీఎం జగన్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.