వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి.. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన భార్య భారతి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో దీనిపై టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా లోకేష్ స్పందించారు. వివేకా హత్య కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుమానంగా ఉందన్నారు. సీఎం జగన్ కు తెలిసే వివేకా హత్య జరిగిందనే విషయం సీబీఐ విచారణలో నిర్ధారణ అవుతోందన్నారు. హత్య చేయించిందెవరో వివేకా కుమార్తె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఉందని తెలిపారు.
ఇది కూడా చదవండి : సీబీఐ వాంగ్మూలం.. జగనన్న మాటలు బాధించాయి: సునీతా రెడ్డి
బాబాయిని చంపింది అబ్బాయేనని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారని.. ఆ విషయం అందరికీ తెలుసన్నారు. సీబీఐ పై కేసులు పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నానన్నాని.. 2019లో చంద్రబాబు చంపారు అన్న వ్యక్తి అధికారం లో వచ్చాక ఎందుకు సీబీఐ విచారణ కోరలేదని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి గుండె పోటు అని చెప్పి ఇప్పుడు రోడ్ల పై తిరుగుతున్నారన్నారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి : సీఎం జగన్ కి షాక్! వై.ఎస్. వివేకా కుమార్తె టీడీపీలో చేరబోతుందా?
తనపై తప్పుడు వార్తలు రాసినందుకు ది వీక్ మ్యాగజైన్ వాళ్లు క్షమాపణచెప్పారని.. జగన్ మోహన్ రెడ్డి పత్రిక క్షమాపణ చెప్పలేదన్నారు. ఇది జరిగి ఇప్పటికి రెండు సంవత్సరాల మూడు నెలలు అయిందని.. ఎంత కాలమైనా పోరాడతానన్నారు. ఎన్నాళ్ళు మా పై తప్పు వార్త లు రాస్తారని లోకేష్ ప్రశ్నించారు. జగన్ వలె 16నెలలు జైల్ కి వెళ్లి కోర్టు కి రాలేదని ప్రజా సమస్యలు పోరాటం కోసం కృషి చేస్తుంటే తమపై తప్పు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. తమతో పాటు తమ నాయకులు కూడా పరువు నష్టం దావా వేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు అని మండిపడ్డారు. లోకేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.