రాజకీయం ఓ చదరంగం.. ఎత్తులకు పైఎత్తులు వేస్తేనే ఈ రాజకీయ క్రీడలో నెగ్గుకురాగలం. లేకపోతే రాజకీయ సన్యాసం తప్పదు. ఇక రాజకీయాల్లో ప్రత్యర్థులతో పాటుగా సొంత పార్టీ నేతలను కూడా ఓ కంట కనిపెడుతుండాలి. లేదంటే.. మనం పునాది అనుకున్న నాయకులే, మన పునాదుల్ని కదిలించే అవకాశాలు కోకొల్లలు. ఇలాంటి సంఘటనలు దేశ రాజకీయాల్లో ఎన్నో చూశాం. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్ కే రోజా తన నియోజకవర్గంలో సొంత పార్టీనేతలతో యుద్ధం చేస్తోంది అని తెలుస్తోంది. అక్కడ ఓ రెడ్డి సామాజీక వర్గానికి చెందిన కీలక YCP నేత.. రోజా ఓటమికి వ్యూహాలు పన్నుతున్నట్లు నగరి నియోజక వర్గంలో చర్చలు జోరందుకున్నాయి.
RK రోజా.. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందింది. నగరి ఎమ్మెల్యేగా ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ.. వారి సాధకబాధకాల్లో పాలుపంచుకుంటుంది అని అక్కడి ప్రజలు చెప్పుకోవడం గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే వచ్చే ఎలక్షన్స్ లో రోజాని ఓడిస్తాం అని సవాల్ చేస్తున్నారు కొంత మంది నాయకులు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే? ఓడిస్తాం అనే వారు ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు కాదు. సొంత పార్టీ అంటే వైసీపీ నాయకులే రోజాని ఓడిస్తామని చెప్పుకుంటున్నట్లు నగరి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కీలక నేత ఒకరు.. రాబోయే ఎలక్షన్లలో రోజాని ఓడించడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నగరి నియోజకవర్గంలో ఉన్న కింది స్థాయి నాయకులతో పాటుగా, ప్రముఖ దేవాలయ శాఖ ఛైర్మన్, మరికొంత మంది జడ్పీ ఛైర్మన్లు రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఆ రెడ్డి నాయకుని సపోర్ట్ చూసుకునే రోజాపై యుద్దాన్ని ప్రకటించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే రోజాకి గెలిచిన కొత్తల్లో ఈ కీలక నేత నుంచే తీవ్ర ఇబ్బందులు ఎదురైయ్యాయి. అప్పటి నుంచే రోజా మీద ఆ నేతకు కోపం ఉందని, ఈ సారి రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా రోజాని ఓడించి తీరుతామని సదరు నాయకుడి అనుచరులు చెప్పుకొస్తున్నారు. అదీకాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆ రెడ్డి నేత దగ్గరకావడంతో.. రోజా పరిస్థితి ఆగమ్యగోచరంగా తయ్యారు అయ్యింది. రాబోయే ఎలక్షన్లలో ఓ వైపు ప్రత్యర్థులతోని, మరో వైపు సొంత పార్టీ నేతలతోని నెగ్గుకు రావడం రోజాకి కత్తిమీద సాములాంటిదే అని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు. మరి అటు ప్రత్యర్థి పార్టీ నాయకులను, సొంత కుంపటి నేతలను రోజా ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.