ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ చేస్తుంటాడు. వైకాపా గుర్తుతోపై గెలిచి ఆ పార్టీ విధానాలను, ఆ ప్రభుత్వం చేస్తున్న పనులపై నిత్యం ఏదో విధంగా విమర్శిస్తుంటాడు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ బృందం పర్యటించింది. దీనిపై సంచలన కామెంట్స్ చేసి మరొసారి వార్తల్లో నిలిచారు.
వైకాపా నేతలకు, వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు మధ్య వార్ కొనసాగుతూన్న విషయం తెలిసిందే.
గతంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన ఎదురుదెబ్బతిన్న సంగతి తెలిసిందే..! ఈ విధంగా కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు రఘురామ కృష్ణంరాజు చేస్తుంటారు. రచ్చబండ పేరుతో ప్రభుత్వపై మండిపడ్డం, ఇసుక, మద్యం, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు, మంత్రుల భాష, మూడు రాజధానులు.. ఇలా పలు అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తారు రఘరామకృష్ణ రాజు. మరోవైపు తమ పార్టీ గుర్తుపై గెలిచి తమ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న రఘురామ కృష్ణం రాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ కు వైకాపా ఎంపీలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అలాగే పార్లమెంటులో అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటిస్తున్న సీఎం జగన్ బృందంపై మరోసారి రఘరామకృష్ణ రాజు కామెంట్స్ చేశారు. సీఎంతో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్న ఫోటో సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేశారు. అంతే కాకుండా…”వరద బాధితులను ఓదార్చేందుకు ఈరోజు చాపర్లో నా ప్రియమైన ముఖ్యమంత్రి మరియు అతని బృందం వెళ్లింది. అయితే ఇది అకేషనా? లేక సెలబ్రేషనా? ఏమో మరి. మీరే నిర్ణయించాలి “అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.