Minister Roja: ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత మంత్రి అయినా తన పిల్లలకి తల్లే కదా. ఏ తల్లికైనా తన పిల్లలకి బహుమతులు ఇవ్వాలని ఉంటుంది. స్థాయిని బట్టి బహుమతి విలువ ఉంటుంది. ఆర్కే రోజాది మంత్రి స్థాయి కాబట్టి గిఫ్ట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. టీనేజ్ వయసున్న కృష్ణ కౌశిక్ కి.. లగ్జరీ బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు రోజా.
కొడుకు కౌశిక్ తో కలిసి రోజా.. బెంజ్ కారుని రివీల్ చేశారు. ఆ తర్వాత కొడుకుని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. తన కొడుకు బ్లూ కలర్ కారు అడిగితే.. బ్లూ కలర్ లైన్లు వచ్చాయని కారు బానెట్ మీద ఉన్న రిబ్బన్స్ ని చూపిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజమ్మ..తన కొడుకుని ఎక్కించుకుని సరదాగా ఒక ట్రైల్ వేశారు.
తన కొడుక్కి రోజమ్మ ఇచ్చిన బెంజ్ మోడల్ ధర 50 లక్షలు పైనే ఉంటుందని అంటున్నారు. తల్లి ఇచ్చిన ఈ కాస్ట్లీ గిఫ్ట్ కి కౌశిక్ ఆనందానికి హద్దులు లేవు. తమ ఇంటికి బెంజ్ కార్ వచ్చిన సందర్భంగా ఇంటిల్లిపాది కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మూగ జీవాలపై ఎడ్ల బండి భారాన్ని తగ్గించిన రైతు బిడ్డలు