రాజకీయం అంటేనే ఒక చదరంగం. వ్యూహాలు, ఎత్తుగడలు, లెక్కలు చాలా ఉంటాయి. ఎన్నికల్లో గెలిచినవారికి మళ్ళీ ఎలాగైనా గెలవాలన్న వ్యూహాలు, ఓడినవారికి ఈసారి ఎలాగైనా గెలవాలి అన్న వ్యూహాలు వేసుకుంటారు. వ్యూహంలో భాగంగా సుదీర్ఘ కాలం పాటు స్కెచ్ లు, ప్లాన్ లు వేసుకుంటారు. ఎంతో కష్టపడి.. ఆలోచించి ఒక ప్రణాళికను రచించుకుంటారు. రాబోయే 6 నెలల్లో ఏం జరగాలో అనేది.. 6 నెలల ముందే ప్రణాళికలు వేసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆ ప్రణాళికలు ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని సార్లు సక్సెస్ అవ్వచ్చు. ఈ విషయంలో టీడీపీ ఫెయిల్ అయ్యిందని చెప్పవచ్చు. టీడీపీ కష్టపడి వేసుకున్న 6 నెలల ప్లాన్ ఒక్క రోజులో, ఒక్క పనితో జగన్ చిత్తు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్షాల వాళ్ళు జగన్ ని.. సైకో అని, నియంత అని, రాక్షసుడు అని, పగ పెడతాడని రకరకాలుగా పిలుస్తుంటారు. టీడీపీ ఐతే ఏకంగా ‘సైకో పోవాలి, సైకిల్ రావాలి’ అనే నినాదాన్ని మొదలుపెట్టేసింది. ఈ నినాదాలు జనాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో మనకి తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో ‘బై బై బాబు’ అంటూ షర్మిల మొదలుపెట్టిన నినాదం.. ఆ పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించింది. నినాదాలకు ఉన్న శక్తి అదే. టీడీపీ కూడా ఇలాంటి నినాదాలతోనే ప్రజల్లో జగన్ పట్ల అసంతృప్తిని పెంచాలని భావిస్తోంది. కానీ ఎవరెంత టార్గెట్ చేసినా జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రతిపక్షాలు జగన్ ని టార్గెట్ చేసిన ప్రతిసారీ తన చర్యలతో వాటికి సమాధానం చెబుతున్నారు.
సామాజిక న్యాయం పేరుతో బీసీలకు మంత్రులుగా అవకాశం ఇవ్వడం గానీ, ఆలయాల్లో పాలక మండలి సభ్యులుగా నాయీ బ్రాహ్మణులకు పదవి కట్టబెట్టడం గానీ, నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలను నిషేధించడం గానీ ఇలా జగన్ అధికారంలోకి వచ్చాక కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అయితే వీటన్నిటినీ మించినదొకటి ఉంది. అదే టీడీపీకి చెందిన నేతకు ఆర్థిక సాయం చేయడం. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. చెప్పినట్టుగానే కుల, మత, పార్టీలకు అతీతంగా పని చేస్తున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం, సంఘం గ్రామానికి చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ బొండ్రోతు శ్రీనివాసరావు కుమార్తె శైలజ విదేశీ విద్యకు రూ. 84 లక్షల ఖర్చును జగన్ ప్రభుత్వం అందజేస్తోంది. విద్యాదీవెన పథకం కింద తొలివిడతగా 13 లక్షల 99 వేల 154 రూపాయల చెక్కుని కూడా అందజేశారు. టీడీపీ నేత బొండ్రోతు శ్రీనివాసరావు సైతం జగన్ చేసిన పనిపై హర్షం వ్యక్తం చేశారు.
పార్టీ చూడలేదు, అర్హత మాత్రమే చూశారంటూ ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారు. ఇది కదా అసలైన పాలన అని టీడీపీ వాళ్ళే అనుకోవాల్సి పరిస్థితి. దీంతో టీడీపీ క్యాడర్ కూడా జగన్ ని సైకో అనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బద్ధ శత్రువైన టీడీపీ పార్టీకి చెందిన నేత కూతురు గురించే ఇంతలా ఆలోచిస్తే.. ఇక జనం గురించి ఎంత ఆలోచిస్తారు అనే కామెంట్స్ వినిపిసున్నాయి. వైఎస్ఆర్ ఫ్యామిలీ రాజకీయమే అంత. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ రాజకీయ శైలి భిన్నంగా ఉంటుంది. ప్రతిపక్షాలు పది మాటలు అంటే.. పదకొండో మాట గొంతు దాటి బయటకు రానివ్వకుండా తమ చర్యలతో గొళ్ళెం పెడతారు. టీడీపీ నేత కూతురు విషయంలో జగన్ చేసిన పనికి.. టీడీపీ కార్యకర్తలు ఆలోచనలో పడాల్సి వచ్చింది.
కింది స్థాయి వ్యక్తికి.. మాజీ సర్పంచ్ కి చేయాల్సిన అవసరం ఉందా అని కూడా ఆలోచించకుండా.. అర్హతను చూసి సాయం చేయడం అంటే గొప్ప విషయమే అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనని వాళ్ళ నోటితో సైకో అనలేని పరిస్థితి కల్పించారు జగన్. ఇది యాదృచ్చికంగా జరిగిందో లేక వ్యూహంలో భాగమో తెలియదు గానీ జగన్ చేసిన పనికి టీడీపీకి రివర్స్ అవుతోంది. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అన్న నినాదం ఎప్పటి నుంచో బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అని అనుకున్నారు. కానీ చివరికి బెడిసికొట్టింది. జగన్ మంచోడా? చెడ్డోడా? అనేది పక్కన పెడితే ఎవరి ఊహలకు అందని వ్యక్తి అని ఆయన చర్యలు చూస్తేనే అర్ధమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగన్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.