గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. వారం క్రితం ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇచ్చిన అధికారులు, రెండు ప్రొక్లెయినర్లతో గ్రామానికి చేరుకొని కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, జనసేన నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వాన్ని అధికారులు మరోసారి కొనసాగించారు. వారం క్రితం ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇచ్చిన అధికారులు, రెండు ప్రొక్లెయినర్లతో గ్రామానికి చేరుకొని కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంటి ప్లాన్ ను అతిక్రమించి, అక్రమ గోడలు నిర్మించారని అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 12 ఇళ్ల ప్రహరీ గోడలను నగర పాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సహకారంతో కూలగొట్టారు. ఈ కూల్చివేతలను స్థానికులు, జనసేన నేతలు అడ్డుకునే ప్రయతం చేశారు. కాసేపు అక్కడ నిరసనలు, ఆందోళనలతో అట్టుడికింది. అయినప్పటికీ.. భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తుగానే పోలీసులు చర్యలు చేపట్టారు. గ్రామంలో పోలీసులు భారీ సంఖ్యలో మొహరించడంతో పాటు గ్రామ సరిహద్దులో పహరా పెట్టారు.
కాగా, ఇప్పటం గ్రామంలో ఇప్పటికే ఒకసారి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పలువురి ఇళ్లకు నోటీసులు ఇచ్చి అధికారులు కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అధికారులు నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లు కూల్చివేస్తున్నారంటూ స్థానికులు హైకోర్టుకు వెళ్లి.. స్టే ఉత్తర్వులు తెచ్చుకోవడం.. అధికారులు స్ధానికులకు ఇచ్చిన నోటీసులును హైకోర్టుకు సమర్పించడం జరిగింది. అనంతరం కోర్టును తప్పుదోవ పట్టించినందుకు నోటీసులు అందుకున్న వారందరికీ లక్ష రూపాయల చొప్పున న్యాయస్ధానం జరిమానా విధించింది. అప్పట్లో బాధిత కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి లక్ష వంతున ఆర్ధిక సాయం అందించారు.
ఇప్పటంలో ఇల్లు కూల్చివేతలు
▪️జనసెన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లినందుకే కూల్చివేతలు అంటూ గ్రామస్తులు ఆందోళన.
▪️తాడేపల్లి మండలం ఇప్పటంలో అధికారుల హడావుడి @JanaSenaParty @JanaswaramNEWS @Pavan_koppolu @psppavankalyan @renuka_jetti @malati_reddi pic.twitter.com/jIQLR5Y0Lj
— m2m News (@m2mnewsTelugu) March 4, 2023