ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక ఢిల్లీ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించే మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు కూడా జరిపింది. ఈ క్రమంలో ఢిల్లీలో వెలుగు చేసిన లిక్కర్ స్కామ్ తాజాగా తెలుగు రాష్ట్రాలను భయపెడుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లిక్కర్ స్కామ్‌లో టీఆర్‌ఎస్ కీలక నేతలు భాగస్వాములుగా ఉన్నారంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేస్తోంది.
ఢిల్లీ మద్య పాలసీ రూపకల్పన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ నేతలు పర్వేశ్ సాహిబ్ సింగ్, మంజీందర్ సింగ్ సిర్సాలు సంచలన ఆరోపణాలు చేశారు. ఈ సందర్భంగా సిర్సా కల్వకుంట్ల కవిత పేరు ప్రస్తావిస్తూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక ప్రస్తుతం ఢిల్లీలో అమలువుతున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన డీల్‌ను కల్వకుంట్ల కవితనే సెట్ చేసింది అని చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్స్ వేదికగా ఈ డీల్ జరిగిందని సిర్సా తెలిపాడు. తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ తరపున ఆయన కుమార్తె కవిత.. లిక్కర్ మాఫియాకు, ఢిల్లీ గవర్నమెంట్‌కు మధ్య డీల్ కుదిర్చారని సిర్సా ఆరోపించాడు. ఇందుకోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల ముడుపులు కూడా అందాయంటూ సంచలన ఆరోపణలు చేసి.. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచాడు సిర్సా.
అంతేకాకక ఒబెరాయ్ హోటల్‌లో ఈ డీల్ జరిగిన సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెళ్ల కోసం బుక్ చేశాడని ఈ సందర్భంగా సిర్సా ఆరోపించాడు.. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ-హైదరాబాద్ మధ్య ప్రయాణాలు చేశారని తెలిపాడు. ఈ ఫ్లైట్‌ను తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిందని ఆరోపించాడు. మరి ఈ ఆరోపణలపై కవిత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.