ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 4-1 తేడాతో ప్రత్యర్థి పార్టీలపై విజయం సాధించింది. ఒక్క పంజాబ్ లో మాత్రం విజయం సాధించలేదు. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. సీఎంల ఎంపిక విషయంలో కొన్ని రాష్ట్రాల్లో కొలిక్కి వచ్చిన మరికొన్ని రాష్ట్రాల్లో ఇంక క్లారిటీ రాలేదు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ ఒక్కటి. ఇక్కడ సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ విజయం సాధించినప్పటికీ.. సీఎం పుష్కర్ సింగ్ ఓడిపోయారు. దీంతో పలువురి నేతల పేర్లు తెరపైకి వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రానికి తొలి మహిళ ముఖ్యమంత్రిని నియమించాలని ప్రధాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కాబోయే మహిళ సీఎం ఎవరు? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామికి ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయను ప్రజలు తిరస్కరించారు. దీంతో కొత్త సీఎం కోసం భాజపా అధినాయకత్వం పలువు పేర్ల పరిశీలిస్తుంది. ఈ క్రమంలో మాజీ సీఎం బీసీ ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీకే సీఎం పగ్గాలు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమామండ్ నుంచి రీతు ఖండూరీకి పిలుపు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపిక విషయంలో అధినాయకత్వం రీతూతో చర్చించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆమెనే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రీతూ ఖండూరీ భర్త రాజేశ్ భూషణ్.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు.
ఈయన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో హెల్త్ సెక్రెటరీగా పనిచేస్తున్నాడు. సీఎం ఎంపికలో రీతూ ఖండూరీ పేరుతో పాటు సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్, మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిషన్ సింగ్ చుఫాల్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి.. ఉత్తరాఖండ్ కి తొలి మహిళ సీఎం కానున్నది అనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.