దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండటంతో ఆమెకు నోటీసులు పంపించింది ఈడీ. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ రానున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుకూడా ఉండటంతో ఆమెకు నోటీసులు పంపించింది ఈడీ. దాంతో ఈ రోజు ఉదయం( మార్చి 11 శనివారం)ఆమె ఈడీ కార్యాలయానికి విచారణకు వచ్చారు. దాంతో ఢిల్లీలోని ఈడీ కార్యలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే సుమారు 9 గంటలకు పైగా అధికారులు కవితను విచారించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి 8.25 నిమిషాలకు హైదరాబాద్ కు రానున్నారు. దాంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇక ఓవైపు కవిత విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కు కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. దాంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 8 గంటల 25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హకీం పేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు అమిత్ షా. అనంతరం రాత్రి హకీంపేట్ లో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై, కవిత ఈడీ విచారణపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఆ తర్వాత ఆదివారం ఉదయం 7.30 గంటలకు CISFడే పరేడ్ లో అమిత్ షా పాల్గొంటారు. దాంతో నగరంలో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే ఓవైపు ఢిల్లీలో కవిత ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక 9 గంటల పాటు కవితను ప్రశ్నించిన అధికారులు ఆమె నుంచి సమాచారన్ని సేకరించారు. సాయంత్రం 3.30 గంటలకు కవితకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అనంతరం విచారణ గది నుంచి కాసేపు బయటకి వచ్చి మళ్లీ అధికారులు ఎదుట విచారణకు వెళ్లారు. మరోసారి ఈనెల 16న విచారణకు హాజరుకావలని కవితకు అధికారులు తెలిపారు.