తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఈసారి ధూమ్ ధామ్ గా జరిగింది. చిరు-బాలయ్య సినిమాలని థియేటర్లలోకి వెళ్లి చాలామంది చూసేశారు. పండగ వీకెండ్ కూడా అయిపోయింది. ఉద్యోగులందరూ ఆఫీసులకు వచ్చే వేళ అయింది. మరో రెండు రోజుల్లో ఎవరి పనిలో వాళ్లు మునిగిపోతారు. అయితే వచ్చే వీకెండ్ కి ఏ సినిమాలు చూడాలా అని ఆలోచిస్తున్నారా? మరేం పర్లేదు. ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రోజుల వ్యవధిలో అవి మీ ముందుకు రానున్నాయి.
ఇక విషయానికొస్తే.. సినిమా అనేది స్క్రీన్ పై చూస్తే వచ్చే కిక్ వేరు. అలా అని అందరూ థియేటర్లలోనే చూస్తారా అంటే అది కష్టమే! ఎందుకంటే ఒకప్పటితో పోలిస్తే ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. ప్రతివారం కూడా పదుల సంఖ్యలో కొత్త సినిమాలు/ వెబ్ సిరీసులు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రేక్షకులు కూడా వాటిని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈసారి పండగ హడావుడిలో అందరూ ఉన్నారు. సో ఈ వీకెండ్ కి అంటే శుక్రవారం- ఆదివారం మధ్య దాదాపు 21 సినిమాలు పలు ఓటీటీల్లో విడుదల కాబోతున్నాయి. వాటిలో ‘ధమాకా’, ‘డ్రైవర్ జమున’, ‘మిషన్ మజ్ను’ సినిమాలతో ATM వెబ్ సిరీస్ లు ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
ATM (తెలుగు వెబ్ సిరీస్) – జనవరి 20
ఛత్రివాలీ (హిందీ మూవీ) – జనవరి 20
డ్రైవర్ జమున (తెలుగు సినిమా) – జనవరి 20
ఝాన్సీ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – జనవరి 19
అల్ఖాలత్ (అరబిక్ మూవీ) – జనవరి 19
జుంజీ ఇటియో మనియాక్ (జపనీస్ సిరీస్) – జనవరి 19
కాపా (మలయాళ సినిమా) – జనవరి 19
ద 90’s షో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
ఉమెన్ ఎట్ వార్ (ఫ్రెంచ్ సిరీస్) – జనవరి 19
మిషన్ మజ్ను (హిందీ సినిమా) – జనవరి 20
బేక్ స్క్వాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ షో) – జనవరి 20
బ్లింగ్ ఎంపైర్: న్యూయార్క్ (ఇంగ్లీష్ రియాలిటీ షో) – జనవరి 20
పౌడా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20
జంగ్-ఈ (కొరియన్ మూవీ) – జనవరి 20
రిప్రజెంట్ (ఫ్రెంచ్ సిరీస్) – జనవరి 20
సహమరన్ (టర్కీస్ సిరీస్) – జనవరి 20
శాంటీ టౌన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20
ధమాకా (తెలుగు సినిమా) – జనవరి 22
ఇందూ సీజన్ 2 (బెంగాలీ వెబ్ సిరీస్) – జనవరి 20
లిపార్డ్ స్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20
ద లెజెండ్ ఆఫ్ వోక్స్ మకీనా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20