సందీప్ కిషన్ 'మైఖేల్'.. థియేటర్లలోకి వచ్చిన మూడు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిపోయింది. తాజాగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.
సినిమాలు ఎంత బాగున్నాసరే కొన్ని థియేటర్లలో రిలీజైన మూడు నాలుగు వారాల వ్యవధిలోనే వచ్చేస్తున్నాయి. కొన్నిసార్లు మంచి ఎక్స్ పెక్టేషన్స్ తో ఆయా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. కానీ వాటిని అందుకోవడంలో పూర్తిగా ఫెయిలవుతాయి. అలా ఈ మధ్య కాలంలో కొంతలో కొంత హైప్ క్రియేట్ చేసి బొక్కబోర్లాపడిన మూవీ ‘మైఖేల్’. సందీప్ కిషన్ హీరోగా చేస్తున్నాడు అనే దాని కంటే విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారనేసరికి సినిమాపై అందరికీ క్యూరియాసిటీ ఏర్పడింది. కానీ దాన్ని అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. థియేటర్లలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిపోయింది.
ఇక విషయానికొస్తే.. ‘కేజీఎఫ్’, ‘విక్రమ్’ సినిమాల ఎఫెక్టో ఏమో గానీ డార్క్ థీమ్ యాక్షన్ మూవీస్ ఈ మధ్య కాలంలో బాగా తీస్తున్నారు. సేమ్ ఆ తరహాలోనే.. కాదు కాదు దాదాపు అలాంటి కథతోనే తీసిన సినిమా ‘మైఖేల్’. ఓ అనాథ కుర్రాడు, ముంబయిలో అడుగుపెడతాడు. డాన్ దగ్గర చేరుతాడు. ఆ తర్వాత ఓ అమ్మాయితో ప్రేమ. చివరకు ఏం జరిగింది అనే కాన్సెప్ట్ తోనే ఈ మూవీని తీశారు. టెక్నికల్ అంశాల్లో బాగా ఉన్న ఈ సినిమా స్టోరీ పరంగా మాత్రం తేలిపోయిందని చూసినవాళ్లు చెప్పారు! ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 24న ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
‘కేజీఎఫ్’ చిత్రంలా తీయాలనే తాపత్రయమో ఏమో గానీ ‘మైఖేల్’ని దాదాపు అలానే తీశారు. సందీప్ కిషన్ తో పాటు విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, అయ్యప్ప శర్మ, వరుణ్ సందేశ్ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ ఎవరి పాత్ర వరకు వాళ్లు అలా చేసుకుంటూ వెళ్లిపోయారు తప్పితే పెద్దగా మెరుపుల్లేవ్. స్టోరీపై కాస్త శ్రద్ధ పెట్టుంటే మాత్రం నెక్స్ట్ లెవల్ సినిమా అయ్యేది. మరి ‘మైఖేల్’ ఓటీటీ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Blood is in his hand! Revenge is in his mind! Michael is here to set your screen on fire! Michael premieres on Feb 24th on Aha! @sundeepkishan @VijaySethuOffl @varusarath5 @menongautham @Divyanshaaaaaa @jeranjit#aha100percenttamil #ahatamil #aha #michael #michaelonaha pic.twitter.com/bxQKkequ3z
— aha Tamil (@ahatamil) February 17, 2023