కొన్ని సినిమాలు ఒకసారి చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలన్న అనుభూతిని కలిగిస్తాయి. థియేటర్స్‌లో చూడకపోతే అరెరె మంచి సినిమాని మిస్ అయ్యామన్న ఫీలయ్యేలా చేస్తాయి. ఇలాంటి ఫీలింగే గార్గి మూవీ సినిమా విషయంలో ఎదురవుతుంది. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి లీడ్ రోల్‌లో నటించిన ఈ ‘గార్గి‘ ఇటీవలే రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎవ్వరూ ఊహించని క్లైమాక్స్‌తో అందరినీ కట్టిపడేసింది ఈ గార్గి. చైల్డ్ అబ్యూస్ కేసులో ఇరుక్కున్న తండ్రిని నిర్దోషిగా నిరూపించడానికి గార్గి అనే యువతి ఏం చేసింది? ఎలా తన తండ్రిని కాపాడింది? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఆద్యాంతం థ్రిల్‌కి గురిచేస్తుంది. అతి సాధారణ యువతిగా గార్గి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించారు.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎవరు ఊహించని క్లైమాక్స్ తో అందరిని ఆకట్టుకున్న “గార్గి” ఈ నెల 12 నుండి సోనీLIV లో స్ట్రీమ్ అవుతుంది.#GargiOnSonyLIV #SonyLIV #Gargi pic.twitter.com/82SXDYezGH
— SonyLIV (@SonyLIV) August 3, 2022
అలాంటి సాయి పల్లవి పెర్ఫార్మెన్స్‌ని థియేటర్స్‌లో మిస్ అయిన వారు ఎవరైనా ఉన్నారా? మరోసారి సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ చూడాలని ఉందా? అయితే మీ కోసం ఈ నెల 12న మీ ఇంట్లోకి వచ్చేస్తోంది గార్గి. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉండి, సోనీలివ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఉంటే సిద్ధంగా ఉండండి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన ‘సోనీలివ్’ ఈ గార్గి మూవీని ఆగస్ట్ 12 నుండి స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీని ప్రసారం చేస్తున్నట్లు సోనీలివ్ సంస్థ తెలిపింది. మరి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో జూలై 15న రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీని చూసేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో కామెంట్ చేయండి.