నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఏంటో వీరసింహారెడ్డి సినిమాతో మరోసారి రుజువైంది. వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమా కలెక్షన్స్ చూస్తేనే అర్థమైపోతుంది.. బాక్సాఫీస్ వద్ద బాలయ్య స్టామినా ఇంకా తగ్గలేదని. దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ.133.55 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. టాలీవుడ్ లో ఇంకా బాలయ్య అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నాడు అనడానికి ఈ లెక్కలు చాలు. సినిమాని థియేటర్లో చూసినా కూడా ప్రేక్షకులు ఓటీటీలోకి ఎప్పుడెడ్డుపు వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు వీరసింహారెడ్డి ఓటీటీ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అప్ డేట్ రానే వచ్చింది.
అవును వీరసింహారెడ్డి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. ఫిబ్రవరి 23వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా డిస్నీ పల్స్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ అప్ డేట్ చూడగానే బాలయ్య అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పుడెడ్డుపా అని ఎదురుచూసిన సినిమా ఓటీటీలోకి వస్తోందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఇంక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య తర్వాతి సినిమాని డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నారు. అనిల్ రావిపూడి ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా నందమూరి బాలకృష్ణను చూపిస్తానంటూ చెబుతున్నాడు. తాను తీసిన కామెడీ జానర్ సినిమాలు కాకుండా ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా దీనిని తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. ఇంక బాలయ్య 109కి సంబంధించి కూడా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. బాలయ్యతో సినిమా చేసేందుకు పూరి జగన్నాథ్, అఖండ సీక్వెల్ కోసం బోయపాటి, మరోసారి బాలయ్యను డైరెక్ట్ చేసేందుకు క్రిష్ జాగర్లమూడి కూడా రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. త్వరలోనే వీరిలో ఒకరి పేరుమీద బాలయ్య 109 ప్రాజెక్ట్ ప్రకటన జరుగుతుందని చెబుతున్నారు.