ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తూ.. తమకంటూ ప్రత్యేక పేరు, గుర్తింపు సంపాదించుకుంటున్న సినిమాలలో కన్నడ సినిమాలు సైతం పోటీ పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా కన్నడ ఇండస్ట్రీ కూడా ది బెస్ట్ కంటెంట్ మూవీస్, మాస్ మసాలా సినిమాలు అందించేందుకు ట్రై చేస్తోంది. ఇప్పుడు మీకోసం ఓటిటిలో ఉనన్ బెస్ట్, టాప్ 10 కన్నడ సినిమాలను సజెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ చూసినా సరే.. అందరూ తప్పక చూడాల్సిన కన్నడ సినిమాలివి.
ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తూ.. తమకంటూ ప్రత్యేక పేరు, గుర్తింపు సంపాదించుకుంటున్న సినిమాలలో కన్నడ సినిమాలు సైతం పోటీ పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా కన్నడ ఇండస్ట్రీ కూడా ది బెస్ట్ కంటెంట్ మూవీస్, మాస్ మసాలా సినిమాలు అందించేందుకు ట్రై చేస్తోంది. అందులో చాలా వరకు కొత్త కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడుతున్నాయి.. అదే విధంగా కన్నడ ఇండస్ట్రీకి గుర్తింపు తీసుకొస్తున్నాయి. అంతెందుకు ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని సౌత్ ఇండియన్ సినిమాలే ఏలుతున్న సంగతి తెలిసిందే. కంటెంట్, బ్లాక్ బస్టర్స్.. ఇలా అన్నివిధాలా ది బెస్ట్ అనిపించుకుంటోంది.
సౌత్ లో మలయాళం తర్వాత కొత్త రకమైన కథలను, కథనాలను అందిస్తోంది కన్నడ ఇండస్ట్రీ. ఇప్పటిదాకా కన్నడ నుండి పాన్ ఇండియా మూవీస్ వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. కన్నడ అంటే.. కేజీఎఫ్ కి ముందు, కేజీఎఫ్ తర్వాతే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. కేజీఎఫ్ ముందువరకు తెలుగువాళ్లకు లేదా ఇండియన్ ప్రేక్షకులకు అసలు కన్నడలో ఏమున్నాయి? అనేది తెలియదు. కానీ.. బాహుబలి 1, 2 తర్వాత బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన వాటిలో కన్నడ నుండి కేజీఎఫ్ 1, 2 వచ్చాయని చెప్పాలి. కన్నడ అనే కాదు.. తెలుగులో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు మీకోసం ఓటిటిలో ఉనన్ బెస్ట్, టాప్ 10 కన్నడ సినిమాలను సజెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ చూసినా సరే.. అందరూ తప్పక చూడాల్సిన కన్నడ సినిమాలివి. వీటిలో ఒకటి రెండు తప్ప.. మిగతావన్నీ తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి.