ఈ రోజుల్లో భూమికి ఎంత డిమాండ్ ఉందనే దాని గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. నేటి ఆధునిక కాలంలో అభివృద్ది చెందుతున్న పట్టణీకరణలో భాగంగా ప్రతీ గజానికి ప్రాంతాన్ని బట్టి రేటు ధర ఉంటుంది. ఇదిలా ఉంటే స్థిరాస్థి కొనుగోలులో భాగంగా చాలా మంది భవిష్యత్ లో భూముల ధరలకు రెక్కలు వస్తాయని ముందు జాగ్రత్తతో ఇళ్ల స్థలాలు కొంటుంటారు. ఇక మరికొంత మంది అయితే కొన్న స్థలాల్లో ఇళ్లు కూడా నిర్మించుకుంటున్నారు. కానీ ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తున్నారు. లక్షలు లక్షలు వెచ్చించి స్థలాలు కొంటారు కానీ.. రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకునే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నిర్లక్ష్యం కారణంగా కొన్న స్థలాలు వెనక్కిపోవడమో, లేదంటే అమ్మిన వ్యక్తి అసలు నేను ఈ స్థలం అమ్మనేలేదు అని చెప్పడమో జరిగి చివరికి మోసం చేస్తుంటారు. ఇప్పటికీ ఇలా ఎంతో మంది మోసపోతుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల కలిగే సమస్యలు, నష్టాలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి కాలంలో చాలా మంది ఉద్యోగులు బాగా సంపాదించి పిల్లల భవిష్యత్ కోసం భూములు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇదే కాకుండా ఇలా ఫ్లాట్లు కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్లు కూడా అధికంగా ఉన్నారు. ఇదిలా ఉంటే కొంతమంది వ్యక్తులు తెలిసిన వ్యక్తుల వద్ద ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి అదే స్థలంలో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అయితే స్థలం కొని, ఇళ్లు నిర్మించుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ.. కొనుగోలు చేసిన స్థలాన్ని మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఇక్కడే లేని పోని అతి పెద్ద సమస్యలు వస్తున్నాయి. తెలిసిన వాళ్ల దగ్గరే కదా కొన్నాం, కొన్ని రోజులు ఆగిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చులే అంటూ నిర్లక్ష్యంతో చేయకూడని తప్పులు చేస్తున్నారు.
ఇలా చేయడం ముమ్మాటికి తప్పు అంటున్నారు న్యాయ నిపుణులు. స్థలం ఎవరి వద్ద కొనుగోలు చేసినా సరే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉత్తమం. కాదని నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇళ్లు కట్టుకుంటే కొన్నేళ్ల తర్వాత అమ్మిన వ్యక్తి సరైన సాక్ష్యాధారాలతో నేను ఎవరికీ అమ్మలేదని, నేను ఎలాంటి డబ్బు కూడా తీసుకోలేదని కోర్టుకు వెళతాడు. ఆ తర్వాత మీ వద్ద ఎలాంటి సాక్షధారాలు ఉండవు కనుక కోర్టు కూడా అతనికే అనుకూలంగా తీర్పు ఇస్తుంది. ఇలాంటివి తప్పలు చేస్తే గనుక మీరు నిండా మోసపోతారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా కాకుండా మీరు కొనుగోలు చేసిన భూములు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి. లేదంటే మీరు లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిందంతా వృధా అవుతుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.