ప్రేమకు హద్దులు, ఎల్లలు, కుల మతాలే కాదూ..ఏదీ అడ్డుకాదని భావించాడు అర్జున్. తాను ట్రాన్స్ జెండర్ నని చెప్పినా ప్రేమించాడు. అతడి ప్రేమను మెచ్చి ట్రాన్స్ జెండర్ సైతం అమ్మాయిగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఓ పాపను దత్తత తీసుకున్నారు. హాయిగా సాగిపోతున్నందునుకున్న సంసారంలో ట్రాన్స్ జెండర్ కుటుంబ సభ్యులు యువకుడ్ని వేధించడం మొదలు పెట్టారు. ఈ ఘటన పంజాబ్ లోని అమృత్ సర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అర్జున్ అనే యువకుడికి రవి అనే ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఏర్పడి, స్నేహం, ప్రేమగా మారింది. అటు రవి సైతం అర్జున్ ను ఇష్టపడటంతో వారూ పెళ్లి చేసుకోవాలని భావించారు. దీని కోసం రవి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. మీన్ రియాగా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఓ పాపను దత్తత తీసుకుని హాయిగా జీవనం సాగిస్తున్నారు. కానీ ఈ పెళ్లిని వ్యతిరేకించిన రియా కుటుంబ సభ్యులు అర్జున్ పై దాడి చేయడం మొదలు పెట్టారు. కాగా, తాను మహిళగా మారాక తనను పెళ్లి చేసుకునేందుకు అర్జున్ నిరాకరించారంటూ రియా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తర్వాత సద్దుమణిగి.. వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
అయితే అప్పటి నుండి రియా కటుంబ సభ్యులు వారిని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా అసభ్యంగా తిడుతున్నారని అర్జున్ చెబుతున్నారు. అంతడితో ఆగకుండా తనను కొట్టారని చెప్పారు. ఈ వేధింపులు ఆపకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ట్రాన్స్ జెండర్ గా మారి.. ప్రేమించిన వ్యక్తి కోసం అమ్మాయిగా మారడమే సాహసం. కానీ వారిని బతక నివ్వకుండా చేస్తున్నారు రియా కుటుంబ సభ్యులు. అర్జున్ పై దాడి చేస్తున్నారు. అర్జున్ పై రియా కుటుంబ సభ్యులు చేస్తున్న దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.