ఇటీవల కాలంలో యువతలో ఆరోగ్య పరిస్థితులు బలహీన పడుతున్నాయి. ఏ మాత్రం చడీచప్పుడు చేయకుండా వస్తున్న గుండెపోటు ప్రాణాలను హరించేస్తుంది. దీని కారణంగా చనిపోతున్న యువతీ యువకుల సంఖ్య పెరిగిపోతుంది.
ఇటీవల కాలంలో యువతలో ఆరోగ్య పరిస్థితులు బలహీన పడుతున్నాయి. ఏ మాత్రం చడీచప్పుడు చేయకుండా వస్తున్న గుండెపోటు ప్రాణాలను హరించేస్తుంది. దీని కారణంగా చనిపోతున్న యువతీ యువకుల సంఖ్య పెరిగిపోతుంది. మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత కుమారుడు జిమ్‌కి వెళ్లి వచ్చి ఇంటికి వచ్చాక హార్ట్ స్ట్రోక్‌తో కుప్పకూలిన సంగతి విదితమే. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ఆయువు పోయింది. ఈ మధ్య కాలంలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఈ గుండె పోటుకు అనేక మంది బాధితులయ్యారు. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో రోడ్డు ప్రమాదాల కన్నా.. హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయిన వారే ఎక్కువ. తాజాగా మరో కాంగ్రెస్ నేత ఇంట్లో విషాదం నెలకొంది.
పెళ్లై 15 నెలలు అయినా కాలేదు ఓ మహిళ గుండె పోటుతో మరణించింది. నల్గొండ జిల్లా నిడమానూను మండలం తుమ్మడము గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మండల ప్రజాపరిషత్ సభ్యుడు యడవెల్లి రంగశాయి రెడ్డి తనయుడు వల్లభ్ రెడ్డి భార్య లహరి గుండెపోటుతో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచింది. ఆమెకు 28 సంవత్సరాలు. గత ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరగ్గా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శుక్రవారం ఉదయం టిఫిన్ చేసి రూమ్‌కు వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు లహరి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. నిడమానూరు మండలం తుమ్మడం గ్రామంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.