ఏలూరు- పశ్ఛిమ గోదావరి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, ఆమెను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఐతే ఆటో డ్రైవర్ బారి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆటో డ్రైవర్ పై కిడ్నాప్, పోక్సో కేసులను నమోదు చేశారు. ఈ ఘడన ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన యాళ్ల తేజ దుర్గాప్రసాద్ అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. ఈ నెల 11న బాలికకు మాయమాటలు చెప్పిన దుర్గాప్రసాద్, ఆమెను తన ఆటోలో ఎక్కించుకునిపోయాడు. ఉరుకు చివరన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు.
ఆ తరువాత బాలిక ఆటో డ్రైవర్ బారి నుంచి తప్పించుకుని, ఏలూరులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్ఐ కిషోర్ బాబు శుక్రవారం రాత్రి ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆటో డ్రైవర్ దుర్గా ప్రసాద్ పరారీలో ఉన్నాడు.