వైరల్ న్యూస్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఇక పుష్ప సినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోను సామి సామి పాట చిన్నా పెద్దా తేజా లేకుండా అందరికి తెగ నచ్చేసింది.
కన్నడ సోయగం రష్మిక మందన్న సామి సామి పాటకు చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. పాటకు తగ్గ మ్యూజిక్, రష్మిక మాస్ స్టెప్పులకు అంతా ఫిదా అవుతున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని బాషల్లోను పుష్ప పాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కేవలం అభిమానులే కాదు సెలబ్రెటీలు సైతం పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు.
ఇక తాజాగా పుష్ప సినిమాలోని సామి సామి పాటకు ఓ ఎయిర్ హోస్టెస్ డ్యాన్స్ చేసింది. ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ హోస్టెస్ ట్రెడీషనల్ గా తయారై, పుష్ప సాంగ్ కు స్టెప్పులేసింది. రష్మిక మందన్న లెవలో కాదు గాని, దాదాపు ఆమెలాగే డ్యాన్స్ చేసే ప్రయత్నం చేసింది ఎయిర్ హోస్టెస్.
సామి సామి పాటకు ఎయుర్ హోస్టెస్ చేసిన డ్యాన్స్ కు అంతా ఫిదా అవుతున్నారు. ఆమె స్టెప్పులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో ట్రై చేస్తే తప్పుకుండా హీరోయిన్ ఛాన్స్ వస్తుందని సలహాలు సైతం ఇస్తున్నారు నెటిజన్స్. ఐతే ఆ ఎయిర్ హోస్టెస్, పేరు మాత్రం తెలియలేదు. మరింకేందుకు ఆలస్యం.. మీరు కూడా ఆమె స్టెప్పులు చూసి ఎంజాయ్ చేయండి.