టాటా గ్రూప్.. దీని గురించి తెలియని వాళ్లు ఎవ్వరూ ఉండరు. వాహనాల నుంచి ఇంట్లో ఉపయోగించే ఉప్పు వరకు టాటా బ్రాండ్ మనకు కనిపిస్తుంది. వ్యాపారంతో పాటు రతన్ టాటా తన సంపాదనలో ఎక్కువశాతం సమాజం కోసం ఉపయోగింస్తుంటారు. అలానే వ్యాపార రంగంలో కూడా తనదైన మార్క్ చూపిస్తోంది ఈ కంపెనీ. ఇటీవలే ఎయిర్ ఇండియాని కూడా కొనుగోలు చేసింది. తాజాగా గూగుల్ పే, ఫోన్‌పేలకు టాటా షాకివ్వనుంది. ఆ రెండు సంస్థలకు ధీటుగా టాటా గ్రూప్ యూపీఐ పేమెంట్ యాప్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఆన్‌లైన్ పేమెంట్లే. చిన్న బడ్డీ కొట్టుకు వెళ్లినా యూపీఐ పేమెంట్ ఉంటోంది. అలాంటి దాన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటోంది టాటా గ్రూప్. త్వరలోనే యూపీఐ పేమెంట్స్ తీసుకురానుంది. యూపీఐ పేమెంట్స్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు టాటా గ్రూప్ ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతులు తీసుకున్నట్లు టాటా గ్రూప్ డిజిటల్ కామర్స్ యూనిట్ తెలిపింది.
నాన్ బ్యాంక్ సంస్థలు థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీసులను ప్రారంభించేందుకు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశీయంగా యూపీఐ సేవల్ని అందిస్తున్న గూగుల్ పే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా టాటా గ్రూప్ రంగంలోకి దిగడంతో యూపీఐ పేమెంట్స్ యాప్స్ మధ్య పోటీ తత్వం నెలకొంది. మరి.. UPI పేమెంట్స్ యాప్ ను టాటా సంస్థ ప్రారంభించనున్నట్లు వస్తున్న టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.