దేశంలో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి రైల్వే. అయితే గతంలో రైల్వేపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. గూడ్సు కన్నా ఘోరంగా వెళుతూ, సమయానికి రాకపోకగా, గమ్యస్థానానికి చూడా వేళకు చేరుకోదు. క్రాసింగ్ ఉంటే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది.
దేశంలో అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి రైల్వే. అయితే గతంలో రైల్వేపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. గూడ్సు కన్నా ఘోరంగా వెళుతూ, సమయానికి రాకపోకగా, గమ్యస్థానానికి కూడా వేళకు చేరుకోదు అన్న అపవాదు ఉంది. క్రాసింగ్ ఉంటే గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది. దీని వల్ల చాలా మంది.. రైలు ప్రయాణాలకు దూరమై రోడ్డు మార్గం గుండా ప్రయాణించడం పెరిగింది. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. అలాగే సమయం కూడా అధికంగా పట్టేది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైళ్ల వ్యవస్థలో మార్పులు తెచ్చింది. బుల్లెట్ ట్రైన్, మెట్రో వంటి వాటితో పాటు వందే భారత్ ఎక్స్ ప్రెస్ వంటి వాటిని కూడా తీసుకు వచ్చింది. ధర ఎక్కువైనప్పటికీ కూడా వేగవంతంగా, సుఖవంతమైన ప్రయాణాన్ని సాగిస్తున్నారు ప్రయాణీకులు.
అయితే కొంత మంది ఈ రైళ్లను తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. పలు మార్లు రైళ్లపై రాళ్లతో దాడి చేస్తున్నారు ఆకతాయిలు. తాజాగా ఓ రైలుపై పలుమార్లు రాళ్లతో తమ ప్రతాపాన్ని చూపించారు. ఇటీవల బెంగళూరు–ధార్వాడ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. అయితే ఆదిలోనే హంసపాదు లెక్కన మొదలైన నాటి నుండి ఈ రైలు దాడులను ఎదుర్కొంటోంది. ప్రారంభమైన 15 రోజుల్లోనే ఈ వందేభారత్ రైలు మూడు సార్లు రాళ్ల దాడికి గురైంది. బలంగా రాళ్లు తగలడంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. అయితే ప్రయాణీకులకు తగలకపోవడం వల్ల పెను ప్రమాదమే తప్పింది. అయితే ఇటీవల కాలంలో వందే భారత్ తో పాటు మామూలు రైళ్లపై రాళ్లతో దాడి చేయడం పరిపాటిగా మారిపోతుంది. దీంతో ప్రయాణీకులు భయపడిపోతున్నారు.
రాష్ట్రంలోని నైరుతి రైల్వే, దక్షిణ రైల్వే, కొంకణ్ రైల్వే జోన్లలో రాళ్లు విసరడం మామూలుగా మారింది. కర్ణాటకలో చెన్నై–మైసూరు, బెంగళూరు–ధార్వాడ మధ్య రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రెండు రైళ్లు ఇప్పటివరకు 24 సార్లు రాళ్ల దాడులకు గురయ్యాయి. ఇక సాధారణ రైళ్లపై కూడా దాడులు జరగుతుండటం విచారకరం. ఏడాదిలో 190కి పైగా రైళ్లపై ఆకతాయిలు రాళ్లు రువ్వారు. గడిచిన ఏడు నెలల్లో నైరుతి రైల్వేజోన్ పరిధిలో 65కు పైగా సాధారణ రైళ్లపై దాడి జరిగింది. రెండుసార్లు ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరోవైపు రైల్వే చట్టం 152, 153 సెక్షన్ల ప్రకారం రాళ్ల దాడి శిక్షార్హమైన నేరం. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా.. దాడులు జరుగుతూనే ఉన్నాయి.