అమ్మ.. ఈ రెండు అక్షరాలు మనకి జీవితాన్ని ఇస్తాయి. జీవితం అంతా కంటికి రెప్పలా కాపాడుతాయి.ఇందుకే ఈ ప్రపంచంలో అమ్మని మించిన యోధులు లేరు అంటారు. అలాంటి తల్లి ముందే.. బిడ్డ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉరుకుంటుంటుందా? తన ప్రాణాలు ఇచ్చి అయినా సరే.. తన ప్రేగు బంధాన్ని కాపాడుకుంటుంది. ప్రస్తుతం ఓ తల్లి కూడా అలానే చేసింది. బిడ్డని కాపాడుకోవాలనే ప్రయత్నంలో సాహసానికి తెగించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
దక్షిణాఫ్రికా దేశంలో ఇప్పుడు ఆందోళన జ్వాలలు రగులుతున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్ జూమాని ఆ దేశ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీనికి నిరసనగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతూ, ప్రైవేట్ ఆస్తులను దోచుకుంటూ రెచ్చిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే కొందరు ఓ భవనానికి నిప్పు పెట్టారు. దీంతో భవనాన్ని దట్టమైన పొగలు చుట్టుముట్టాయి.కానీ.. ఆ సమయంలో నాలేడి మన్యోని అనే మహిళ తన ఏడాది బిడ్డతో పాటు బిల్డింగ్ మూడో అంతస్థులోనే ఉండిపోయింది. బయటకి పోవడానికి దారులు అన్నీ మూసుకుపోయాయి. చుట్టూ పొగ, బిడ్డకి ఊపిరి ఆడటం లేదు. తమకి సెగ తగలేకపోయినా.., అక్కడే ఉంటే తన బిడ్డకి ఊపిరి తీసుకోవం కష్టం అవుతుందని నాలేడి మన్యోని అర్ధం అయిపోయింది.
దీంతో.. వెంటనే తాను ఉంటున్న మూడో అంతస్థు కిటికీ నుంచి మొదటి అంతస్థులో గల షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ మీదకు దూకింది ఆ తల్లి. ఆ తర్వాత ఆమె బిడ్డను ఎవరో కిటికీ నుంచి కిందకి విసరడంతో క్యాచ్ పట్టుకుంది. ఆ తరువాత అక్కడ నుండి ఆ చిన్నారిని రోడ్డు మీద ఉన్న జనం మీదకి విసరగా.. వారు బిడ్డని పట్టుకున్నారు. ఆ తరువాత అంత ఎత్తు నుండి ఆ తల్లి కూడా కిందకి దూకి తన బిడ్డని ముద్దాడింది. ప్రస్తుతం ఈ ఘటనకి సంభందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. చూశారు కదా..? ఇదే తల్లి ప్రేమ. ప్రాణాలకి తెగించి బిడ్డని కాపాడుకున్న నాలేడి మన్యోనికి నిజంగా సెల్యూట్ చేయకుండా ఎలా ఉండగలం? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
This was too painful to watch💔💔 pic.twitter.com/WL964kZUWH
— Katlie_Moo▪️ (@Katlie_Moo) July 13, 2021