బట్టలు ఉతకాలన్నా, వేడి నుంచి ఉపశమనం పొందాలన్నా ఎక్కువగా విద్యుత్ పరికరాల వైపే చూస్తున్నారు. వాషింగ్ మిషన్లు, కూలర్లు, ఎసిలు వాడకం ఎక్కువై పోయింది. దీంతో కరెంట్ బిల్లులు కూడా అధికంగా వచ్చి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. కరెంట్ బిల్లును నియంత్రించుకునేలా ఓ ప్రత్యేకమైన లైట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రస్తుత రోజుల్లో విద్యుత్ వినియోగం ఎక్కువైపోయింది. నిమిషం పాటు కరెంట్ పోయినా ఊపిరి ఆగిపోయినట్లుగా ఫీలవుతున్నారు జనాలు. పరిశ్రమల నుంచి గృహాల వరకు కరెంట్ వాడకం పెరిగిపోయింది. దీంతో కరెంట్ బిల్లులు సైతం పెరిగిపోయాయి. ముఖ్యంగా గృహాల్లో అయితే ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఎక్కువైపోయింది. ఇంట్లో ఫ్రిజ్ లు, ఎసిలు, ఫ్యాన్లు, టివిలు, లైట్స్, వాషింగ్ మిషన్స్ వంటివి అవసరం కొద్ది వినియోగిస్తున్నారు. వీటి వాడకంతో కరెంట్ బిల్లులు కూడా ఎక్కువగా రావడంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. కరెంట్ బిల్లులతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ కరెంట్ బిల్లు తక్కువగా వచ్చేలా చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఓ ప్రత్యేకమైన లైట్ల వాడకంతో అధికంగా వచ్చే కరెంట్ బిల్లు నుంచి ఉపశమనం పొందవచ్చును. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇళ్లల్లో, ఆఫీసుల్లో నిత్యం లైట్లు వాడే వారు ఆ ప్రత్యేకమైన లైట్స్ తో విద్యుత్ ఆదాతో పాటు, కరెంట్ బిల్లును కూడా తగ్గించుకోవచ్చు. కరెంట్ బిల్లును తగ్గించి, విద్యుత్ ఆదా చేసి, పర్యావరణహితంగా ఉపయోగపడే సోలార్ ఎల్ ఈడి లైట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ లైట్లను ఇళ్లలో వాడినట్లైతే కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చును. ఈ సోలార్ ఎల్ ఈడి లైట్లను ఎనిమిది గంటలపాటు ఛార్జ్ చేస్తే సుమారు 48 గంటల పాటు వినియోగించుకోవచ్చు. కరెంట్ పోయినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే మార్కెట్ లో సోలార్ లైట్లు రెండు రకాలుగా లభ్యమవుతున్నాయి. అవి హోమ్ హాప్ సోలార్ ఎల్ ఈడీ లైట్స్, డెక్ ఎల్ఈడి లైట్స్. ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో లభిస్తున్న ఈ సోలార్ ఎల్ ఈడి లైట్ల ధరలు తగ్గింపు ధరలతో రెండువేల లోపే వీటిని కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సోలార్ ఎల్ ఈడి లైట్ల వాడకంతో కరెంట్ బిల్లును నియంత్రించుకోవచ్చు.