ఫిల్మ్ డెస్క్- ఆడవాళ్లు మీకు జోహార్లు.. శార్వానంద్, రష్మిక మందన జోడిగా నటించిన తాజా సినిమా. ఈ మూవీ మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్బంగా ఆదివారం ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయి పల్లవి తదితరులు అతిధులుగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లోనే ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా శర్వానంద్.. సాయి పల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. చక్కగా నటిస్తుందని కాదు.. ఆమె మనసుతో చూస్తుంది.. మనసుతో మాట్లాడుతుంది.. సాయి పల్లవి నాకు మంచి ఫ్రెండ్.. మనసుతో మాట్లాడితే ఇలా కనెక్ట్ అవుతారా.. అని నాకు అర్థమైంది.
నేను కూడా ఇకనుంచి అలానే ఉంటాను.. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుంటుంది.. అందరికీ ప్రేమను పంచగలదు.. అందుకే ఇలా అందరినీ సాధించుకుంది. ఇక ఆమెను వెళ్లనిద్దాం. ఒంట్లో బాగా లేదు. ఒంట్లో లేకపోయినా వచ్చింది.. ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి.. అని శర్వానంద్, సాయి పల్లవి గురించి గప్పగా చెప్పారు . ఇక ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు ప్రాణం పోసింది దేవీ శ్రీ ప్రసాద్ అని అన్నారు శర్వానంద్.
సినిమా ఇస్తే బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇస్తాను అని ఓ పదిహేనేళ్ల క్రితమే దేవీశ్రీ ప్రసాద్ తనతో చెప్పాడని, ఇప్పుడు ఈ సినిమా ఇచ్చాడని తెలిపాడు. పాటలు హిట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని శర్వానంద్ అన్నాడు. ఈ సినిమా తన కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాలో పని చేసిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పారు శర్వానంద్.